రాజంపేట పట్టణంలో జరుగుతున్న జాతీయ జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ లో విన్నర్ గా ఉత్తరప్రదేశ్ జట్టు నిలిచింది. రన్నర్ అప్ గా తమిళనాడు టీమ్ గెలిచింది. రాజంపేట పట్టణంలోని ఇన్ ఫ్యాంట్ జీసస్ స్కూల్లో గత వారం రోజులు గా జరుగుతున్న జాతీయ జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ నేడు ముగిసింది.
నేడు జరిగిన ఫైనల్స్ లో ఉత్తరప్రదేశ్ రికార్డు సృష్టించింది. బాలికల విభాగం విన్నర్ గా పశ్చిమ బెంగాల్ జట్టు నిలిచింది. కేరళ టీమ్ రన్నర్ అప్ గా నిలిచింది. విజయం సాధించిన జట్లకు రాజంపేట శాసన సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఆయనతో బాటు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి,ఆర్.డి.ఓ ధర్మ చంద్ర రెడ్డి, డి.యస్.పి.నారాయణ స్వామి రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వీరితో బాటు సెక్రటరీ పోలా శ్రీనువాసులు రెడ్డి, రామచంద్ర రెడ్డి, భానుమూర్తి రాజు, సమీర్ భాషా, రమణ రావు, నారాయణ రాజు, డి.సి.యం.సి.చైర్మన్ దండు గోపి, మార్కెట్ ఉప చైర్మన్ భాస్కర్ రాజు, భోజన కమిటీ ఛైర్మన్ హరి నాథ్ చౌదరి, వివిధ కమిటీ న్యముతుల్లా, యూసఫ్, గోవిందు బాలకృష్ణ మన్నూరు సి.ఐ నరసింహులు, పట్టణ సి.ఐ శుభభూషన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.