30.7 C
Hyderabad
April 19, 2024 08: 39 AM
Slider నల్గొండ

ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి విద్యాశేఖర్

#pasyapadma

అభ్యుదయ భావజాలంతో ప్రభుత్వ విద్యారంగ ఉన్నతికి కృషి చేసిన విద్యా శేఖర్ ఆదర్శప్రాయుడని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎస్టియు నాయకులు విద్యాశేఖర్ సంస్మరణ సభలో  పశ్యా పద్మ పాల్గొని మాట్లాడుతూ బడుగు,బలహీన,పీడిత వర్గాలు సమాజంలో సముచిత స్థానం పొందాలని విద్యాశేఖర్ జీవితాంతం తపించారని కొనియాడారు.ఎస్టియు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సైద్ధాంతిక నిబద్ధత, విలువలతో కూడిన విద్యాబోధన చేయడంలో,ఉపాధ్యాయుల హక్కులకోసం సమరశీల పోరాటాలు చేయడంలో విద్యా శేఖర్ ఎల్లప్పుడూ ముందుండేవారని అన్నారు.

ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో బొమ్మగాని ప్రభాకర్, అర్వపల్లి రంగారావు,పరాబ్ కుమార్, కేవీఎన్ మూర్తి,అంకతి అప్పయ్య, దొంతగాని,ఓరుగంటి నాగేశ్వరరావు, కంబాల శ్రీను,శివయ్య,బూర వెంకటేశ్వర్లు, కె.వి.సత్యనారాయణ,ఆర్ శ్రీనివాస్, కళాకారుడు జానయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రజాగళం వినిపించే కుండబద్దలు సుబ్బారావు మృతి బాధాకరం

Bhavani

ధాన్యం బకాయిలు చెల్లించాలని తెలుగుదేశం ధర్నా

Satyam NEWS

హే డ్రంకర్స్:తాగి నడిపి రూ.2.25 కోట్లు ఫైన్ కట్టారు

Satyam NEWS

Leave a Comment