37.2 C
Hyderabad
March 28, 2024 20: 57 PM
Slider ముఖ్యంశాలు

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహం తప్పదు

#NationalBundhNew

కేంద్ర కార్మిక సంఘాల నేతలు ఇచ్చిన పిలుపు మేరకు INTUC,CITU,IFTU,AITUC, TRSKV సంఘాల నాయకత్వంలో వందలాది మంది కార్మికులు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు.

ప్రదర్శన అనంతరం సభలో CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, IFTU జిల్లా నాయకుడు మేకల నాగేశ్వరరావు,INTUC జిల్లా నాయకుడు బెల్లంకొండ గురవయ్య, జిల్లా కార్యదర్శి  సలిగంటి జానయ్య,AITUC జిల్లా అధ్యక్షుడు జడ్ శ్రీనివాస్,TRSKV జిల్లా నాయకుడు పచ్చిపాల ఉపేందర్ తదితర ప్రముఖ నాయకులు మాట్లాడారు.

కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కార్మిక, రైతు, విద్యార్థి, ఉద్యోగ వర్గాలపై పార్లమెంటులో కొత్త చట్టాలను తెస్తూ, కార్మిక వర్గాలకు ఉపయోగపడుతున్న చట్టాలను కుదిస్తూ చట్టసభలలో ఆమోదింప చేసి కార్మికులను దోపిడీ వర్గాలకు  వర్గాలకు ఊడిగం చేసే విధంగా తయారు చేస్తున్నారని విమర్శించారు.

ప్రజా వ్యతిరేక విధానాల బిజెపి ప్రభుత్వం

44 చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి వేస్తున్నారని రక్తపుటేరులు నుండి సాధించుకున్న 8 గంటల పని విధానం నేడు 12 గంటలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

రైల్వే, విమానయాన, ఎల్ ఐ సి, బొగ్గు గనులను, ఆర్ జె సి లాంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు గుత్తేదారుల ఆదాని, అంబానీలకు అమ్మ చూస్తున్నారని అన్నారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపై ఢిల్లీ లోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో లాఠీలతో టర్ క్యాన్లతో విరుచుకుపడి విపరీతంగా దాడి చేయిస్తున్నారని, వీటికి వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకునే అంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. రైతుల దాడికి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు విడనాడాలని, సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన కార్యక్రమాలు, ర్యాలీ నిర్వహించిన కార్మిక సంఘాలు బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు.

మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో చేసిన కార్మిక వ్యతిరేక మార్పులకు, కీలక రంగాలతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు, పారిశ్రామిక కార్మికుల వినిమయ ధరల సూచిని 2016కు మార్చటానికి, రైతులకు నష్టదాయకమైన చట్టాలు చేయటానికి, విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఒక వైపు కరోనా వైపరీత్యము, మరోవైపు జీవనోపాధి దెబ్బతిని ఆదాయాలు అడుగంటి దేశవ్యాప్తంగా ప్రజల కష్టాలు ఎదుర్కొంటుంటే అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవస్థలో ఉన్న ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టడం మాని ప్రజలపై భారం మోపుతోందని దుయ్యబట్టారు.

కరోనా విపత్కర పరిస్థితుల వలన జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులను , ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  కొనుగోలు శక్తి పడిపోయి ఆర్ధిక వ్యవస్థ మందగించినప్పుడు కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు పన్ను రాయితీలు ఇచ్చి ప్రజలపై భారాలు వేసిందని అన్నారు.

ప్రధానమంత్రి మోడి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ కార్మికులపై బానిసత్వాన్ని రుద్దుతుందని ఆరోపించారు. కార్మికవర్గం తరతరాలుగా పోరాడి కార్మిక చట్టాలను మార్పులు చేసి కార్మికులపై బానిసత్వాన్ని రుద్దిందని దుయ్యబట్టారు. 

కోట్లాది మంది అసంఘటిత కార్మికులను కార్మిక చట్టాల పరిధిలో లేకుండా చేసిందని విమర్శించారు. ప్రభుత్వాలు  ప్రజావ్యతిరేక విధానాలను విడనాడకపోతే రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని, పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఇందిరాల వెంకటేశ్వర్లు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, నాగారపు పాండు, ఎస్.కె సైదా, రామచంద్ర రావు, యాకోబు, మన్నెం నాగేశ్వరరావు, మేళ్లచెరువు ముక్కంటి, చప్పిడి సావిత్రి, ఇందిరాల రామకృష్ణ, పుల్లయ్య, లతీఫ్, బక్కయ్య, వివిధ కార్మిక వర్గ సంఘ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ రైతుల మేలు కోసమే నూతన చట్టాలు

Satyam NEWS

5 వ తేదీ నుంచీ 18 గంటల పాటు కర్ఫ్యూ: ఏపీ కేబినెట్ ఆమోదం

Satyam NEWS

వనపర్తి జిల్లా కలెక్టర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన tuwj (iju)

Satyam NEWS

Leave a Comment