మంచిర్యాల పట్టణ కేంద్రంలోని గౌతమ్ నగర్ లో సుమారు 2,52,400 రూపాయల విలువ గల నిషేధిత పొగాకు ఉత్పత్తులను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కుమారస్వామి, మంచిర్యాల పట్టణ ఎస్ఐ మారుతీ లు సిబ్బంది తో కలిసి మంచిర్యాల పట్టణంలోని గౌతమ్ నగర్ లోని వెనిశెట్టి శంకరయ్య ఇంట్లో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వ ఉంచి వ్యాపారం నిర్వహిస్తున్నారు అనే పక్కా సమాచారంతో తనిఖీ చేయగా సుమారు 2, 52, 400/- రూపాయల పొగాకు ఉత్పత్తులు లభించాయి. ఈ పొగాకు ఉత్పత్తులైన గుట్కాను స్వాధీనం చేసుకుని, వెనిశెట్టి శంకరయ్య విచారించగా ఈ నిషేదిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు కర్ణాటక ప్రాంతం నుండి గుర్తు తెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరలకు తీసుకు వచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు రహస్యం గా అమ్ముతున్నానని చెప్పాడు.
previous post