37.2 C
Hyderabad
April 19, 2024 13: 43 PM
Slider హైదరాబాద్

విపత్కర పరిస్థితుల్లో ఆదుకోవడానికి రాందేవ్ రావు ట్రస్ట్ ఆసుపత్రి

#Ramdev Rao Trust Hospital

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ లో విలయతాండవం చేస్తున్న తరుణంలో ప్రజలకు అవసరమైన వైద్యం అందజేస్తున్నామని ట్రస్ట్ హాస్పిటల్ రాందేవ్ రావు ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ తోట దయాకర్, సీఈఓ డాక్టర్ యోబు లు తెలిపారు. 

మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్ ప్రాంతంలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాందేవ్ రావు ఆసుపత్రిలో ప్రజల కు వైద్యం అందించాలని స్వచ్ఛంద గా తమ ఆసుపత్రి ముందుకు వచ్చిందని తెలిపారు.

సిబ్బందికి కరోనా పరీక్షలు

సేవలు చేస్తున్న తరుణంలో సుమారు 20 మంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ ఎలాంటి లక్షణాలు లేకుండా కనిపించడంతో 147 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 20 మందికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో 18 మంది వైద్య సిబ్బందికి తమ సొంత ఖర్చుల తో తమ సంస్థలోనే క్వారంటైన్ లో ఉంచి ప్రతి రోజు పౌష్టికాహారం తో పాటు ప్రతి రోజు 3 సార్లు చెస్ట్, పలుమోనోలజీ, ఇతర డాక్టర్లు తో జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

అవుట్ పేషంట్లకు కూడా కరోనా పరీక్షలు

అనంతరం సీఈవో డాక్టర్ యోబు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ లకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయా లేవా అని నిర్దారించటానికి ఆసుపత్రి ముందు జ్వరం క్లినిక్ లాంటిది ఏర్పాటు చేసి కోవిడ్ లక్షణాలకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అవి లేకపోతే నే ఆసుపత్రి లోపలికి ప్రవేశం కల్పిస్తున్నామని, వాటిలో భాగంగానే శానిటైజర్ టన్నెల్, ఫేస్ మాస్క్, హెడ్ కాప్, షూ మాస్క్, పిపిఈ కిట్టు లాంటివి ధరించి ఉండేటట్లు చూస్తున్నాం అని తెలిపారు.

పాజిటీవ్ వచ్చిన ఆసుపత్రి సిబ్బందికి హోమ్ క్వారంటైన్ లాగా ఇన్ స్టిట్యూట్ క్వారంటైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. వారికి పూర్తిగా తమ ఆసుపత్రి యాజమాన్యం ఉచితంగా వైద్యం అందిస్తుంది అని తెలిపారు. ప్రజలు ఎవ్వరు కూడా రాందేవ్ రావు ఆసుపత్రి గురించి భయపడవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో అయిన ప్రజల కు వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Related posts

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శార్వానంద్, రష్మిక

Satyam NEWS

టిడిపి నాయకుడిపై ఇన్ కం టాక్స్ దాడి

Satyam NEWS

Leave a Comment