ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తర్వుల మేరకు రాష్ట్ర జాతీయ సేవా పథకం (NSS) అధికారిగా డా కె.రమేష్ రెడ్డి ఈ రోజు ఉదయం వెలగపూడి లో పదవీ బాధ్యతలను స్వీకరించారు. అన్ని జిల్లాల NSS సమన్వయకర్తలు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా డా కె.రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదవి పట్ల నిబద్దతతో పని చేస్తానని అన్నారు. అదే విధంగా తన శక్తిమేరకు పని చేసి ఆశించిన ఫలితాలను తీసుకువస్తానని ఆయన చెప్పారు. ఆపన్నులకు సహాయం అందించేందుకు నైపుణ్యత కలిగిన సేవలు అందిస్తానని ఆయన అన్నారు.
previous post