28.7 C
Hyderabad
April 20, 2024 06: 09 AM
Slider సినిమా

నగ్నంగా సినిమాలు తీసేస్తున్న రామ్ గోపాల్ వర్మ

#Ramgopal Varma

మంచి సినిమాలు తీసి పేరు తెచ్చుకునే దర్శకులు, నిర్మాతలు ఉన్నట్లే చెత్త సినిమాలు తీసి కూడా పేరు తెచ్చుకునేవాళ్లు ఉంటారు. అందులో ప్రథముడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్య వరుసగా చిత్రాలు తీసేస్తున్నాడీయన. మియా మాల్కోవా అనే నగ్న చిత్రాల సుందరిని పెట్టి క్లయిమాక్స్ అనే చిత్రం తీసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నగ్నం అనే చిత్రాన్ని మూడు భాషల్లో తీసేస్తున్నాడు.

నేకెడ్, నంగీ, నగ్నం పేర్లతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీస్తున్నాడు. అది కూడా త్వరలో విడుదల కాబోతున్నది. ఆ మధ్య పొలిటికల్ సెటైర్లు తీసి బొక్క బోర్లా పడ్డ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయం బాట వదిలి పెట్టి రొమాన్సు, వైయలెన్సు వైపు చూస్తున్నాడు. కరోనాతో ప్రపంచం అల్ల కల్లోలం అవుతున్న టైమ్ లో కరోనా వైరస్ పేరుతో హారర్ చిత్రం తీసిన అత్యంత ప్రతిభావంతుడు ఈ రామ్ గోపాల్ వర్మ.

సినిమాలు ఆడకపోయినా విపరీతంగా పేరు తెచ్చుకోవడం రామ్ గోపాల్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య. పబ్లిసిటీ కొట్టేసి సినిమా హిట్టయినా ఫట్టయినా డబ్బులు సంపాదించుకోవడం కూడా రామ్ గోపాల్ వర్మకు బాగా తెలిసిన విద్య. ఇప్పుడు త్వరలో ఏ సబ్జెక్టు అయితే కెలక కూడదో ఆ సబ్జెక్ట్ పై పడ్డాడు.

గాడ్సేపై రాబోతున్న మరో చిత్రం

అదే ‘‘ద మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’’ అంటే గాడ్సే పై సినిమా అన్నమాట. దేశ భక్తి సంగతి పక్కన పెడితే మహాత్మా గాంధీ ప్రపంచ మానవాళికి ఆదర్శవ్యక్తి. మహాత్మాగాంధీ ని హత్య చేసిన గాడ్సేను ఎవరూ బహిరంగంగా ఆరాధించరు. సమాజంలో ఉన్న కట్టుబాటు అది. గాడ్సే చేసింది కరెక్టా కాదా అనే అంశంపై కూడా బహిరంగంగా చర్చించరు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు చొరవ తీసుకుని గాడ్సే అంతరంగం పేరుతో కొన్ని వీడియోలు తయారు చేసి ఆయన పుట్టిన రోజు అయిన మే 19న విడుదల చేశారు. దానిపైనే తీవ్ర వివాదం చెలరేగింది. గాడ్సే అంతరంగాన్ని ఆవిష్కరించడం అంటే దేశ భక్తిని ప్రేరేపించడమే అనే వాదన కూడా ఉంది.

అదే సమయంలో మత కలహాలను రెచ్చగొట్టడం అనే సెంటిమెంటు కూడా ఉంది. ఇంతటి కాంట్రవర్సీ ఉన్న సబ్జెక్టును ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసుకున్నాడు. ఇప్పటి వరకూ ఆయన తీసిన రాజకీయ సినిమాలు వేరు, ఇది వేరు. ఇది దేశంలో మతకలహాలు రేపేందుకు పూర్తి ఆస్కారం ఉన్న సినిమా అవుతుంది.

రామ్ గోపాల్ వర్మ చిత్రాలకు సెన్సార్ బోర్డులో బోలెడు అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటాయి. సెన్సార్ అభ్యంతరాలను దాటుకుంటూ సినిమా రూపంలో రావడానికి రామ్ గోపాల్ వర్మ ఎన్నో కసరత్తులు చేస్తుంటాడు. ఇప్పుడు సెన్సార్ బోర్డు చిక్కులు లేకుండా, రాకుండా ఒక కొత్త ఫార్ములాను రామ్ గోపాల్ వర్మ కనిపెట్టాడు. అదే ఓటీటీ ప్లాట్ ఫారం. ఓవర్ ది టాప్ మీడియా.

ఇది కేబుల్, బ్రాడ్ కాస్టు, శాటిలైట్ టెలివిజన్ కు భిన్నంగా ఇంటర్ నెట్ ఆధారిత మీడియా సర్వీసు. ఇందులో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలను వదులుతున్నాడు. ఈ ప్లాట్ ఫారం కు సెన్సార్ లేదు. ఇంకా రాలేదు. మరింకే రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతున్నాడు. పూటకో సినిమా తీసేస్తున్నాడు… రొమాన్సు…వైలెన్సు ఆధారంగా.

Related posts

తదుపరి వ్యూహంపై టీడీపీ ఎంపీల భేటీ

Satyam NEWS

మంత్రి బొత్సాను బురిడీ కొట్టించిన అధికారులు

Satyam NEWS

రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

Satyam NEWS

Leave a Comment