35.2 C
Hyderabad
April 20, 2024 15: 44 PM
Slider సినిమా

సినిమా కాదు ట్రైల‌ర్‌ చూడాలన్నా డబ్బులే

#Power Star

క‌రోనా లాక్ డౌన్ సమయంలో సినీ పరిశ్రమ గగ్గోలు పెడుతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎడాపెడా డబ్బులు సంపాదించేస్తున్నాడు. కరోనా సమయంలో నగ్నం, క్లైమాక్స్ పేరుతో ఆన్ లైన్ లో www.rgvworldtheatre.comలో రెండు సినిమాలు విడుదల చేసి ప్రేక్షకుల నుంచి డబ్బులు కొల్ల గొట్టిన రామ్ గోపాల్ వర్మ ఈ సారి ‘పవర్ స్టార్’ సినిమా పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

పవన్ కల్యాణ్ ను పోలిన క్యారెక్టర్ ను పెట్టేసి పబ్లిసిటీ కొట్టేసి ఇప్పుడు ట్రైల‌ర్‌ కే రేటు ఫిక్స్ చేసేశాడు. జూలై 25న ఉదయం 11గంట‌లకు ట్రైలర్ విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేశాడు. అయితే  జూలై 22న ఉదయం 11గంల.ల‌ నుండి “పవర్ స్టార్” ట్రైలర్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో అందుబాటులో ఉంటుందని, ఈ ట్రైలర్ చూడాలంటే పే ఫర్ వ్యూ పద్ధతిలో 25 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నాడు. ఇది ప్రపంచంలో మొట్ట మొదటి పెయిడ్ ట్రైలర్ అని చెప్పుకొచ్చాడు. ఇక  ‘పవర్ స్టార్’ సినిమా కోసం www.rgvworldtheatre.com లో ‘ట్రైలర్ బుకింగ్’ – ‘అడ్వాన్స్ బుకింగ్’ – ‘బ్లాక్ బుకింగ్’ – ‘కరెంట్ బుకింగ్’ అని 4 రకాల పే పర్ వ్యూ బుకింగ్స్ తీసుకొచ్చాడు.

జూలై 25 ఉదయం 11 లోపు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే టికెట్ ధర రూ. 150 అని, అదే 11 గంటల తర్వాత బ్లాక్ లో టికెట్స్ కొన్నట్లు ధర రూ. 250 చెల్లించాల్సి ఉంటుందని, ముందే బుక్ చేసుకుంటే రూ.100 సేవ్ అవుతాయి. త్వరపడండి అంటూ సలహా కూడా ఇస్తున్నాడు.

Related posts

రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహశీల్దార్

Satyam NEWS

శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల….15 నిమిషాల్లోనే ఖాళీ

Satyam NEWS

ఐక్యతను చాటానున్న క్రీడలు

Bhavani

Leave a Comment