38.2 C
Hyderabad
April 25, 2024 14: 57 PM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మ ఈ సారి టార్గెట్ అల్లూ అరవింద్

#Allu Aravind

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి ప్రముఖ నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి బావమరిది అయిన అల్లూ అరవింద్ పై సినిమా తీస్తున్నాడు. అల్లూ అరవింద్ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎదిగాడు అనేది ప్రధాన అంశంగా ఉంటుందని సినీవర్గాలు పేర్కొన్నాయి.

అంతే కాకుండా సిని ఇండస్ట్రీలో ఎవరెవరిని తొక్కేశాడు అనేది కూడా ఉంటుందని అంటున్నారు. వర్ధమాన తారలను తీసుకువచ్చి ఆయన మాట వినకపోయినా, ఆయన బిజినెస్ కు అడ్డం వచ్చినా ఎలా తొక్కేస్తాడనేది ప్రధాన అంశంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తున్నట్లు తెలిసింది.

ఇందులో ఒక ప్రముఖ హీరో అంశం ముఖ్యంగా ఉంటుందని అంటున్నారు. కెరియర్ ప్రారంభం లోనే బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆ హీరోకు ఫ్లాప్ సినిమాలు వచ్చేలా అరవింద్ ఎలా ప్లాన్ చేశాడనేది కూడా సినిమాలో చూపిస్తాడట. రామ్ గోపాల్ వర్మ తీసే ఈ చిత్రం పేరు ‘‘అల్లూ’’. ఈ చిత్రం పోస్టర్ రేపు విడుదల కాబోతున్నది.

Related posts

రండి సినిమా ధియేటర్లలోనే సినిమా చూద్దాం

Satyam NEWS

హ్యాపీ పొంగల్: కొత్త దిశలో దినకరుడి దివ్యయాత్ర

Satyam NEWS

చంద్రబాబు లోకేశ్ హౌస్ అరెస్ట్: 12 గంటల దీక్ష

Satyam NEWS

Leave a Comment