37.2 C
Hyderabad
March 29, 2024 19: 13 PM
Slider సినిమా

సెక్సీ స్టోరీ: తల్లిదండ్రులు, మికాయిలా ఓ రామ్ గోపాల్ వర్మ

ramgopla varma

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ నిర్ణయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకాశానికి ఎత్తేశాడు. ఏమిటానిర్ణయం అని ఆలోచిస్తున్నారా? స్పీల్ బర్గ్ కుమార్తె 23 సంవత్సరాల మికాయిలా స్పీల్ బర్గ్ నగ్న చిత్రాలలో నటించేందుకు నిర్ణయించుకోగా ఆమె అభిప్రాయాన్ని స్పీల్ బర్గ్ మనస్ఫూర్తిగా స్వాగతించాడట.

అసలు ఇంత కన్నా గొప్ప విషయం ఉంటుందా అనే అర్ధం వచ్చే విధంగా రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశాడు. నగ్న చిత్రాలలో నటించాలనే ఆమె నిర్ణయాన్ని తండ్రి స్వాగతించడాన్ని బట్టి ప్రపంచం మారుతోంది అంటూ ఆయన ట్విట్ లో పేర్కొన్నాడు.

మికాయిలా స్పీల్ బర్గ్, కేట్ ల ఆరవ సంతానం. 1996 లో పుట్టిన మికాయిలా ను వారు దత్తత తీసుకున్నారు. అప్పటికే వారు ఒక బ్లాక్ ను (కుమారుడు థియో) దత్తత తీసుకోగా అతనికి తోడుగా మరో బ్లాక్ ఉండాలన్న సదుద్దేశ్యంతో మికాయిలాను దత్తత తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట మికాయిలా ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో తాను పోర్న్ చిత్రాలలో నాటించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. దాంతో ఒక్క సారిగా సంచనలనం రేగింది. తనకు ఉన్న అద్భుతమైన అందం, శరీర సౌష్టవం ఉపయోగించుకుని తాను డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నట్లు మికాయిలా తెలిపింది. తనకు ఇంకా సెక్స్ వర్కర్ లైసెన్సు రాలేదని అది రాగానే పూర్తి స్థాయి శృంగార తారగా మారాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తన నిర్ణయాన్ని స్వాగతించడానికి తన 47 ఏళ్ల కాబోయే భర్త చెక్ పాన్ కోవ్ ఆమోదించడానికి చాలా సమయం తీసుకున్నాడని మికాయిలా తెలిపింది.

తాను శృంగార చిత్రాలలో వేరే వారితో కలిసి నటించేది లేదని, తాను చెక్ మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. తన శరీరాన్ని చూపిస్తూ సింగిల్ గా నగ్న చిత్రాలలో నటిస్తానని చెప్పింది. తన తల్లిదండ్రులపై తనకు అపారమైన ప్రేమ గౌరవం ఉన్నాయని వారికి తన నిర్ణయాన్ని చెప్పేందుకు ముందు ఆందోళన చెందానని మికాయిలా తెలిపింది. అయితే వారు తన నిర్ణయాన్ని ఆమోదించడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని కూడా మికాయిలా చెప్పింది.

Related posts

బస్సు ఛార్జీల పెంపుపై కాంగ్రెస్ ధర్నా

Satyam NEWS

31 న విడుదల కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘చేజింగ్’ చిత్రం

Bhavani

ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి

Bhavani

Leave a Comment