28.7 C
Hyderabad
April 25, 2024 05: 57 AM
Slider సినిమా

రామ్ గోపాల్ వర్మకు కరోనా… వచ్చింది/రాలేదు

#Ramgopal Varma

ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటీవ్ వచ్చింది. మర్డర్ సినిమా విడుదలపై మిర్యాలగూడాకు చెందిన అమృత వేసిన పిటీషన్ విచారణ చేపట్టిన నల్గొండ ఎస్ సి, ఎస్ టి కోర్టు కు ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ లాయర్ వివరణ ఇస్తూ తన క్లయింట్ కు కరోనా వచ్చిందని అందువల్ల తాను సకాలంలో సమాధానం ఇవ్వలేకపోతున్నానని కోర్టుకు వివరణ ఇచ్చాడు.

దాంతో కోర్టు తన విచారణను వాయిదా వేసింది. అయితే ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మవద్దని రామ్ గోపాల్ వర్మ నేటి సాయంత్రం ట్విట్ చేశాడు. తనకు కరోనా వచ్చినట్లు చెప్పడం కరెక్టు కాదని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో చెప్పాడు. రామ్ గోపాల్ వర్మకు కరోనా నిజంగా వచ్చిందా? రాలేదా అనేది సస్పెన్స్.

కోర్టుకు అలా చెప్పిన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత ట్విట్టర్ లో ఇలా వివరణ ఇవ్వడం ఏమిటో అర్ధం కాదు. రామ్ గోపాల్ వర్మ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని అమృత అంటున్నది. మర్డర్ చిత్రం అమృత ఆమె తండ్రి మారుతీరావు లపై రామ్ గోపాల్ వర్మ తీసినది.

అందులో కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయని అవి తమకు సంబంధించినవి అయినందున సినిమాను నిలుపుదల చేయాలని అమృత తదితరులు కోరుతున్నారు. ఈ మేరకు వారు నల్గొండ ఎస్ సి, ఎస్ టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణకు హాజరు కాకుండా రామ్ గోపాల్ వర్మ కోర్టుకు ఈ విధంగా చెప్పి ఆ తర్వాత ట్విట్టర్ లో ఖండించారని అమృత అంటున్నది.

Related posts

పాఠశాలలు తెరుస్తున్నప్పుడు ఎన్నికల నిర్వహణకు ఇబ్బందేంటి?

Satyam NEWS

బాలానగర్​ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్​రాం నామకరణం

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment