విద్యార్ధుల జీవితాల్లో ప్రధాన పాత్ర పోషించే ఉపాధ్యాయులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్ర పతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కోరారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అని ఆయన అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం కావాలని ఆయన ఉద్భోదించారు. విద్యార్ధులలో అంతర్లీనంగా దాగిఉన్న ప్రతిభను ఉపాధ్యాయులు వెలికి తీసుకురావాలని తద్వారా దేశానికి దిక్సూచులుగా మెలగాలని ఆయన కోరారు. దేశ భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు టీచర్లు అంకిత భావంతో పని చేయాలని ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ఉపాధ్యాయులను కోరారు.
previous post
next post