వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మారినా పెబ్బేరు మండలం రాంపురం గ్రామం రోడ్డు పరిస్థితి మారలేదని ప్రజలు తెలిపారు. రోడ్డు దారుణంగా ఉంది. చాలా సంవత్సరాల నుండి రోడ్డు మరమ్మతుకు నోచుకోలేదని చెప్పారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యేలు మారుతున్నా కానీ మా ఊరు రోడ్డు బాగుపడటం లేదని తెలిపారు. రాంపూరు రోడ్డును మరమ్మతు చేయాలని ప్రజలు కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్