39.2 C
Hyderabad
March 28, 2024 17: 08 PM
Slider సినిమా

మాస్ యాక్షన్ ప్రియుల కోసం ‘రణస్థలి’

#ranastalam

సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రం ‘రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధర్మ హీరోగా అమ్ము అభిరామి, చాందిని రావు.. లు హీరోయిన్లుగా ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం..  కీలక పాత్రలు పోషించారు. టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న ‘రణస్థలి’  మూవీ ఈరోజు అనగా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే బసవ( ధర్మ) అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. ధర్మ తండ్రి మున్నియ్య(సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. 6 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా..  చేసిన అప్పు తీర్చడం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటాడు.

ఈ క్రమంలో అతను చక్రవర్తి(బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు. అయితే ఒకరోజు చక్రవర్తి తోటలో పనిచేయడం కోసం నలుగురు పనివాళ్ళు వస్తారు. వీళ్ళకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ,అమ్ములకి చెబుతాడు. అయితే వచ్చింది పని వాళ్ళు కాదు మర్డర్లు చేసే కిరాయి గుండాలు.వాళ్ళ గురించి బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములుని చంపేస్తారు? అసలు ఆ గుండాలు ఎందుకు చక్రవర్తిని, అమ్ముని చంపేశారు. వాళ్ళను ఎవరు పంపించారు. అసలు చక్రవర్తి ఎవరు? అనేది తెర పై చూడాల్సిన కథ.

నటీనటుల విషయానికి వస్తే బసవ పాత్రలో ధర్మ చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలా పెర్ఫార్మ్ చేశాడు. అమ్ములు పాత్ర చేసిన చాందినీ రావు చాలా చక్కగా చేసింది. అమ్ము అభిరామి పాత్ర గురించి చెబితే స్పాయిలర్ అవుతుంది. కానీ  ఆమె కూడా చాలా చక్కగా చేసింది.  సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రలో జీవించేశాడు. విలన్ గా చేసిన శివ కూడా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పండు  వంటి వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయిపోవడం ఖాయం.హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ చూస్తే ఇతని దర్శకత్వ ప్రతిభ ఏంటనేది అర్ధమవుతుంది, మాస్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసే విధంగా ఆ ఎపిసోడ్ ను డిజైన్ చేసుకున్నాడు.

థియేటర్లలో ఈ సీన్ కు విజిల్స్ పడటం ఖాయం అనే చెప్పాలి. అలాగే లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ లు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. దర్శకుడు తర్వాత ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్ ఎపిసోడ్స్ ను ఇతను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది.

కెమెరామెన్ జాస్టి బాలాజీ  కూడా బాగా సహకరించి మంచి ఔట్పుట్ ఇచ్చాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో పరశురాం శ్రీనివాస్ వ్రాసిన పాటలు , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం అనే చెప్పాలి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చేశారు. రన్ టైం కూడా 2 గంటల 20 నిమిషాలే ఉండడం మరో ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.

మాస్ ఆడియన్స్ ను యాక్షన్ ప్రియులను తప్పకుండా అలరించే రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి.. అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమా అని కూడా చెప్పొచ్చు.మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కోసం తప్పకుండా థియేటర్లలో చూడదగ్గ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్ : 3.5/5

Related posts

కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తులు

Bhavani

జనవరి 15న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Satyam NEWS

కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజాస్వామ్య విజయం

Satyam NEWS

Leave a Comment