అన్నమయ్య జిల్లా రాజంపేటపట్టణంలో శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి ఆధ్వర్యంలో మూడవ శ్రీ గోదాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాజంపేట తోట కళ్యాణ మండపంలో సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా, ఆధ్యాత్మికతే పరమావధిగా, భావించి లోక కళ్యాణం కోసం శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా వైభవోపేతంగా జరిగిన శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీ దేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ప్రత్యేక వేదికపై కళ్యాణ వధూవరులను కూర్చోపెట్టి, స్వర్ణభరణాలతో పట్టు వస్త్రాలతో,వివిధ రకాల పుష్పాలతో నేత్ర పర్వంగా అలంకరించారు. కన్నుల పండుగ గా జరిగిన శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో గోమాత పూజ, తులసి పూజ,ఎదుర్కోల్లు వేడుకల అనంతరం కళ్యాణోత్సవం వేద పండితులతో నిర్వహించారు.ఈ సందర్భంగా చిన్నారుల దేవతా వేష ధారణ భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి శ్రీ శుక బ్రహ్మాశ్రమ ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సంపూర్ణా నందగిరి స్వామి వేదాంతాచార్య వేద ప్రవచనాలు భక్తులను ఆకట్టు కున్నాయి. కళ్యాణం అనంతరం భక్తులకు ముత్యాల తలంబ్రాలు, తీర్థ ప్రసాదాలు,అన్న ప్రసాదం పంపిణీ చేశారు.