31.2 C
Hyderabad
February 14, 2025 20: 45 PM
Slider జాతీయం

ఓవర్ యాక్షన్: నిందితుడికి పోలీసుల మద్దతు లా విద్యార్థిని ఆత్మహత్య

rape suicide

అత్యాచారం కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరాబంకి ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో సదరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్రామ పంచాయతీ అధికారి తన స్నేహితుడితో కలిసి తనపై సామూహిక అత్యాచారం చేశాడని స్థానిక పోలీస్ స్టేషన్‌లో లా విద్యార్థిని (22) ఫిర్యాదు చేసింది. రెండు నెలల క్రితం పోలీసులు ప్రభుత్వాధికారిపై కేసు నమోదు చేయకుండా ఇంటికి పంపించారు. దీంతో నిందితుడు బాధితురాలు చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించింది. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికి దర్యాప్తులో నిందితుడికి అనుకూలంగా స్థానిక ఎస్‌ఐ వ్యవహరించడంతో బాధితురాలు ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. స్థానిక ఎస్‌పి ఆకాశ్ తోమర్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈ కేసులో నిర్లక్యం వహించిన పోలీసులను సస్సెండ్ చేశాడు. ఈ అత్యాచారం కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలు శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Related posts

ఈనెల 26న వాహనాల వేలం

Sub Editor 2

కార్మికులందరికీ P.F మరియు E.S.I సౌకర్యం కల్పించాలి

Satyam NEWS

బిజెపి మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడి యత్నం

Satyam NEWS

Leave a Comment