28.7 C
Hyderabad
April 20, 2024 03: 46 AM
Slider సినిమా

14 న రిలీజ్ అవుతున్న కె జి ఎఫ్ రాక్ స్టార్ యాష్ ‘‘రారాజు’’

#KGFstarYesh

పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు. కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో బారీ ఎత్తున అక్టోబర్ 14న రిలీజ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మావతి ఫిలింస్ సుబ్బారావు, డైరెక్టర్ మల్లిడి గాంధీ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ , లిరిక్ రైటర్ గురు చరణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  నిర్మాత వి ఎస్. సుబ్బారావు మాట్లాడుతూ రాక్ స్టార్ యశ్ అయన సతీమణి రాధిక పండిట్ హిరో హీరోయిన్లుగా  నటించిన ఈ చిత్రం కన్నడ లో పెద్ద సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగులో రారాజు పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో అక్టోబర్ 14న  రిలీజ్ చేస్తున్నాము.ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు లిరికల్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ అందరినీ మెప్పిస్తుంది అని అన్నారు. పాన్ ఇండియా స్టార్ హీరో యాష్ నటించిన రారాజు మంచి హిట్ కావాలని కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఆకాంక్షించారు. యాష్, హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణం.

Related posts

తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్స్ నిరసన

Satyam NEWS

బ్రాహ్మణ ఆడ పిల్లలకు శుభవార్త….!

Satyam NEWS

నేటి నుండి ఉచిత బియ్యం పంపిణీ

Satyam NEWS

Leave a Comment