37.2 C
Hyderabad
April 19, 2024 13: 31 PM
Slider నల్గొండ

నిర్వాసితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో

#hujurnagar congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మిర్యాలగూడ ప్రధాన రహదారికి ఇరువైపులా నివాసముంటున్న పేద ప్రజల గృహాలను కూల్చిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లేదా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గృహ నిర్వాసితులు కళ్యాణి,నాగేంద్ర,నాగమ్మ, బాలమ్మ లతో పాటు 20 మంది పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కాంట్రాక్టర్ చేస్తున్న పనులను అడ్డుకొని రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐ ఎన్ టి యు సి నాయకుడు యరగాని నాగన్న గౌడ్, పీసీసీ జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు తదితరులు మాట్లాడుతూ గడిచిన 40  సంవత్సరాలుగా సుమారు 400 వందల మంది పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చినా, నేటి వరకు గృహాలు నిర్మించనందున రోడ్డు ప్రక్కన జీవనం చేస్తున్నారని,పూరి గుడిసెలు,రేకులు వేసుకుని జీవనం సాగిస్తున్న తరుణంలో నెల రోజుల క్రితం కాంట్రాక్టర్ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లోని సామాన్లు తీసుకునే అవకాశం ఇవ్వకుండా ధ్వంసం చేశారని తీవ్రంగా ఆరోపించారు.

పేదలకు జరిగిన నష్టపరిహారాన్ని కాంట్రాక్టర్ చెల్లించే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎస్ఐ ఆర్ డి ఓ తో సంప్రదించి మాట్లాడిన పిదప నాలుగు రోజులలో సమస్యను పరిష్కారం చేస్తామన్న వారిచ్చిన హామీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకో విరమించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్ పి టి సి గల్లా వెంకటేశ్వర్లు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్,పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు రామరాజు, బెల్లంకొండ గురవయ్య,మేళ్లచెరువు ముక్కంటి,పోతనబోయిన రామ్మూర్తి, సుదర్శన్,అర్జున్, కస్తాల రవిచంద్ర కుమార్,పెద్దబ్బాయి,పాషా,సలిగంటి జానయ్య,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రూ.5 లక్షలు వసూలు చేసిన కేసులో విలేకరి పై కేసు

Satyam NEWS

వాటర్ ప్లాంట్ యజమానులకు హెచ్చరిక.. అనుమతి లేకుంటే సీజ్

Satyam NEWS

వెల్లివిరిసిన మతసామరస్యం: మిలాద్ నబీ రోజునే సిరిమాను సంబరం

Satyam NEWS

Leave a Comment