39.2 C
Hyderabad
April 18, 2024 18: 46 PM
Slider ఆధ్యాత్మికం

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి

#tirumala

సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

వాహనసేవల వివరాలు

ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం
9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
11 నుంచి 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు -చంద్రప్రభ వాహనం
ఆర్జిత సేవలు రద్దు
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Related posts

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Satyam NEWS

క‌రోనా పరిస్థితుల నేపథ్యంలో ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి

Satyam NEWS

శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Satyam NEWS

Leave a Comment