29.7 C
Hyderabad
April 18, 2024 06: 02 AM
Slider చిత్తూరు

తిరుపతి పవిత్రతకు “విఘాతం” కలిగించకండి

#NaveenkumarReddy

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లకు ఓటర్ స్లిప్పులు ఇచ్చే ప్రక్రియలో శనివారం 28 వ డివిజన్ రేషన్ షాప్ డీలర్ ప్రమేయం పై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఆర్ పి గా ఉంటూ ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్ లతోపాటు అధికార పార్టీ కర పాత్రలను ఇవ్వడం శోచనీయమని ఆయన అన్నారు. అధికార పార్టీకి సహకరించకపోతే రేషన్ కార్డులు తొలగిస్తామని పింఛను నిలిపివేస్తామని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడం చట్టరీత్యా నేరంమని ఆయన అన్నారు.

సంబంధిత అధికారులు వెంటనే వారి జీతం నిలుపుదల చేసి చర్యలు తీసుకోవాలి రేషన్ డీలర్ షిప్ ను “రద్దు” చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రశాంత వాతావరణంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

Related posts

ఓన్లీ 4 :అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న ఆ నలుగురు

Satyam NEWS

హైదరాబాద్‌ – పుదుచ్చేరి ల మధ్య ప్రారంభమైన తొలి డైరెక్ట్ విమానం

Satyam NEWS

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

Leave a Comment