27.7 C
Hyderabad
April 20, 2024 01: 04 AM
Slider మహబూబ్ నగర్

కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న రేషన్ బియ్యం వ్యాపారులు

#KalwakurthyRice

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ బియ్యం దందాకు పేరుగాంచింది. రేషన్ బియ్యం దందా చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ సొమ్మును కోట్లాది రూపాయలుగా వ్యాపారులు కొల్లగొడుతున్నారు.

పార్ బాయిల్డ్  యజమానులు  సివిల్ సప్లై అధికారులు కలిసి ప్రభుత్వ సొమ్ము గండి కొడుతున్నా పుట్టించు కొనే నాథుడే కరవయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారి కిందిస్థాయి అధికారులకు తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

ఒక సామాజిక కార్యకర్త సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టిస్తున్నారని ఫిర్యాదుతో స్పందించిన సివిల్ సప్లై ఉన్నతాధికారులు సోమవారం ఎన్ ఫోర్స్ మెంట్ సిబ్బంది కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సాయి ఫార్వర్డ్ మిల్లులో తనిఖీలు నిర్వహించారు.

కాగా అధికారులు తూతూమంత్రంగా  తనిఖీలు నిర్వహించి తప్పుడు లెక్కలతో  ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక సమర్పిస్తున్నట్లు సమాచారం. కల్వకుర్తి పట్టణంలోని ఎల్లికల్ రోడ్ లో ఉన్న శ్రీ సాయి ఫార బాయిల్డ్ రైస్ మిల్లును 2017  లో నే 4344/2017 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా  విక్రయించారు.

అప్పటి నుండి నేటి వరకు పాత యజమాని పేరు మీదనే సీఎంఆర్ వడ్లను కోట్లలో తప్పుడు రికార్డులతో ప్రభుత్వ అధికారులు నమోదు చేస్తూ  ప్రభుత్వ సొమ్మును ఆ యజమానికి పట్టం కడుతున్నారు. ప్రస్తుత సంవత్సరం 30 నుండి 35 కోట్ల వరకు విలువ చేసే ప్యాడిని సీఎంఆర్ కింద పాత యజమానికి ఇచ్చారు.

అందులో ఆ యజమాని మూడు కోట్ల వరకు ప్యాడిని  బయట అమ్ముకున్నట్లు  ఆ సామాజిక కార్యకర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సోమవారం రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు జిల్లా స్థాయి అధికారులు గుట్టుగా యజమాని క్యాబిన్ లో తనిఖీ లు నిర్వహించారు.

మిల్లు ఎంత ప్యాడి ఉంది, రికార్డు మాత్రమే  తనిఖీ నిర్వహించారు కానీ రికార్డు ప్రకారం ఆ మిల్లులో మిగిలిన ఒడ్లు ఉన్నాయా లేదా అనే విషయంపై ఆరా తీయలేదు. అధికారుల పనితీరును చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుందని, మిల్లు అమ్ముకున్న వ్యక్తికి ఏ విధంగా ప్రభుత్వం సీఎంఆర్ కింద వడ్లు ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు.

స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లైసెన్స్ లేని, మున్సిపాలిటీ రికార్డు పరిధిలో అక్కడ మిల్లు ఉన్నట్లు గాని, ఫ్యాక్టరీ లైసెన్స్ , అగ్నిమాపక సిబ్బంది చే  సేఫ్టీ సర్టిఫికెట్ వివిధ కార్యాలయంలో మిల్లు కు కావలసిన ధ్రువీకరణ పత్రాలు లేని వారికి సీఎంఆర్ వడ్లు ఎలా ఇస్తారని నగరవాసులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

మిల్లు యజమానికి జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా మద్దతు తెలపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విచారణ పేరుతో క్యాబిన్ లో మిల్లు యజమాని తో చర్చలు జరిపి విలేఖర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విలేకరులను నిర్లక్ష్యంగా మాట్లాడుతూ మీ చేసుకుంటారా చేసుకోమని ఏమి రాసుకుంటారా రాసుకోమని రాష్ట్ర స్థాయి అధికారులు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.

సోమవారం తనిఖీలు నిర్వహిస్తామని శుక్రవారం సాయంత్రమే జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్ర స్థాయి అధికారులు తెలపడం జిల్లా స్థాయి అధికారులు పట్టణంలోని సోమవారం మిల్లర్లకు తనిఖీలు నిర్వహిస్తామని ముందే సమాచారం అందడంతో మిల్లు లో ఉన్న రేషన్ బియ్యాన్ని ప్రతి మిల్లు యజమానులు రహస్య ప్రదేశాలకు శనివారం రోజే తరలించారు.

కాగా  సాయి పార బాయిల్డ్ లో రేషన్ బియ్యాన్ని  అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని ఉద్దేశంతో విలేఖరులు ముందుకు రాగా వారిని మాట్లాడనీయకుండా మిల్లు యజమానిని ఉసి గొలిపి వాగ్వాదానికి దింపారు. మిల్లు యజమాని గొప్ప వెంకటేష్ మిల్లు విక్రయ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్టార్ లో  రిజిస్ట్రేషన్ ఫీజును సైతం ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. 

వ్యవసాయేతర పొలమును వ్యవసాయ భూమిగా  సృష్టించి రిజిస్ట్రేషన్ సమయంలో 25 లక్షల నుండి 30 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజును సైతం 25000  రూపాయల విలువలతో రిజిస్ట్రేషన్ చేసేసారు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. అధికారులు ఇంతటి నిర్లక్ష్యాన్ని వ్యవహరించడంపై  ఎలాంటి శాఖాపరమైన చర్యలు చట్టపరమైన చర్యలు కరువైన క్రమంలో దేశం ఎటు పోతుందో అని ఆశ్చర్యం కలిగిస్తుంది.

Related posts

రెండు నెలల్లో 1300 ఇళ్లు పూర్తి కావాలి…!

Bhavani

5 లక్షల శ్రీవారి దర్శన టికెట్లు గంటలో సేల్

Satyam NEWS

బీఆర్ఎస్ విజయవంతం కావాలని బాసరలో పూజలు

Satyam NEWS

Leave a Comment