31.2 C
Hyderabad
April 19, 2024 06: 30 AM
Slider మహబూబ్ నగర్

అధికారుల అండదండలతో రేషన్ బియ్యం దందా

#Wanaparthy Police

సివిల్ సప్లై అధికారుల అండదండలతో వనపర్తి జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతుంది. కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపు లేకపోవడంతో… గడిచిన మూడు నెలల వ్యవధిలో స్పెషల్ పార్టీ అధికారులు  5 సార్లు రైస్ మిల్ ను సీజ్ చేసినా కూడా ఆ మిల్లు నుండి  అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే వుంది.

ఈ మధ్యనే నెల క్రితం హైదరాబాద్ నుండి స్పెషల్ ఎన్ ఫోర్సు మెంట్ వారు మిల్లు పై ఆకస్మికంగా దాడి చేయగా వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యన్నీ పట్టుకుని ఐదుగురిపై కేసులు నమోదు చేసినా పరిస్థితి మారడం లేదు. వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని పరమేశ్వర్ రెడ్డి రైస్ మిల్లు నుంచి భారీగా లారీలో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న పక్క సమాచారంతో జిల్లా కేంద్రంలో పట్టణ ఎస్సై వెంకటేష్ గౌడ్ అద్వర్యం లారీని పట్టణ పొలిస్టేషన్ కు తరలించి రైస్ మిల్ యజమాని పరమేశ్వర రెడ్డితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

వనపర్తి జిల్లాలో రేషన్ బియ్యం దందా చేసే అక్రమార్కులు జిల్లా పోలీసులకు, పౌరసరఫరాల అధికారులకు సవాలు విసురుతూ పట్టపగలు ఎలాంటి అనుమతులు లేకుండా 540 బస్తాల్లో 270 క్వింటాల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీకి కనీసం రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతుంది.

మధ్యాహ్నం లారీ ని పోలీసులు అదుపులోకి తీసుకుంటే రాత్రి పది గంటల వరకు కూడా సివిల్ సప్లై అధికారులు ఆలారీ పై  ఎలాంటి చర్య తీసుకోక పోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మీడియా వారు మొదట అధికారులను వివరణ కోరగా అంతా కరెక్టే వుంది అవి CMRF బియ్యం అని సమాధానం ఇచ్చారు. ఈ విషయం జిల్లా  కలెక్టర్ దృష్టి కి వెళ్లగా ఆమె సివిల్ సప్లై అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసి  పూర్తి వివరణ కోరగా అప్పుడు అధికారులు కంట్రోల్ బియ్యమే నని, అవి అక్రమంగా తరలిస్తూన్నారని నిర్ధారణ చేశారు.

రేషన్ బియ్యం అక్రమ దందాకు తెరలేపిన పరమేశ్వర రెడ్డి 15రోజుల వెవధిలో భారీగా రెండుసార్లు బియ్యం పట్టుపడ్డ జిల్లా పౌరసరఫరాల అధికారులు చర్యలు తీసుకొక్కకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ బియ్యం అక్రమలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం పిడియాక్ట్ కేసులు నమోదు చేయాలని చెప్పిన అధికారులు పెడచెవిన పెడుతూ చేతులు దులుపుకుంటున్నారు.

Related posts

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం..

Sub Editor

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో బీఆర్ఎస్ లో చేరిక‌లు

Bhavani

భాజపాను అధికారంలోకి తేవడానికి కృషి చేయాలి

Satyam NEWS

Leave a Comment