27.7 C
Hyderabad
April 24, 2024 08: 48 AM
Slider మెదక్

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం

#rationrice

హైదరాబాద్ నుండి కర్ణాటక రాష్ట్రానికి రేషన్ బియ్యం తరలిస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండల్ ముత్తంగి శివారు రింగ్ రోడ్డు దగ్గర శుక్రవారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం సంచలనం కలిగిస్తున్నది. పోలీస్ అధికారులు KA-56, 5230 వాహనాన్ని తనిఖీ చెయ్యగా 190 క్వింటల్ బియ్యం ఉన్నట్టు తెలుసుకున్నారు.

వెంటనే ఆ వాహనాన్ని సిజ్ చేసి అందులో వున్న బియ్యన్ని పఠాన్ చేరులోని ఫార సరఫరాల గోదాంకి తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్ తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్ సయ్యద్ తన్విర్, బియ్యం యాజమాని ఎండి సుస్రతుల్లా పైన అధికారులు ఇసి యాక్ట్ 1955 ప్రకారం 6ఎ కేసు నమోదు చేసి పఠాన్ చేరు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఈ తనిఖీలో ఫార సరఫరా అధికారులు సురేష్ కుమార్, ఎండీ శపియుద్దీన్, ఆర్ఐ రంగయ్య, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

జులై 9 నుంచి ఆషాఢ బోనాలు

Bhavani

కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం

Satyam NEWS

బకాయి జీతాలు, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment