30.2 C
Hyderabad
February 9, 2025 19: 25 PM
Slider ముఖ్యంశాలు

సీక్రెట్: రేవ్ పార్టీలో అమ్మాయిలు నెల్లూరు వారు

touch pub

జూబ్లీహిల్స్ లోని ఎ సీక్రెట్ ఎఫైర్ పబ్ లో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈవెంట్ ఆర్గనైజర్ ప్రసాద్ అనే వ్యక్తి ఇలా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రేవ్ పార్టీలు నిర్వహిస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సారి ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఒక ఫార్మా కంపెనీ సేల్స్ పెంచుకునేందుకు డాక్టర్లకు, సేల్స్ ఉద్యోగుల కోసం ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేయించినట్లు తెలిసింది. దీని కోసం ఆ పబ్ ను ఆ ఫార్మా కంపెనీ బుక్ చేసుకున్నది.

ఈ రేవ్ పార్టీలో 22 మంది యువతులతో నగ్న నృత్యాలు చేయించారు. ఈ యువతులను వ్యభిచారం కోసం నగరానికి తెచ్చారని పోలీసులు గుర్తించారు. పట్టుబడ్డ యువతులంతా ఏపీ లోని నెల్లూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సినీమా ఛాన్సుల కోసం ఈవెంట్ డ్యాన్సుల కోసం హైదరాబాద్ వచ్చి వ్యభిచార రొంపిలోకి ఇలా యువతులు జారిపోతున్నారు. ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీ పేరును మాత్రం పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడు.

Related posts

నిరంకుశ పాలన తో కొల్లాపూర్ ప్రజలు కష్టాలపాలు….!

Satyam NEWS

పోలీస్ ఎలర్ట్: బైక్ చోరీల అంతర్ జిల్లా ముఠా అరెస్ట్

Satyam NEWS

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీల మృతి

Satyam NEWS

Leave a Comment