39.2 C
Hyderabad
April 25, 2024 16: 00 PM
Slider ప్రపంచం

రవీష్ కుమార్ కు మెగసెసె అవార్డు

Raveesh Kumar

ప్రతిష్ఠాత్మక రామన్‌ మెగసెసె అవార్డు ప్రముఖ జర్నలిస్టు రవీష్‌కుమార్‌ కు దక్కింది. ఈ ఏడాది ఈ అవార్డు మొత్తం ఐదుగురికి లభించింది. అందులో రవీష్‌కుమార్ ఒకరు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో సెప్టెంబరు 9న ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. రవీష్‌కుమార్‌తో పాటు మయన్మార్‌ జర్నలిస్టు కో స్వీ విన్, థాయ్‌లాండ్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంగ్‌ఖానా నీలప్‌జిత్‌, దక్షిణ కొరియాకు చెందిన సామాజిక కార్యకర్త కిమ్‌ జోంగ్‌-కి, ఫిలిప్పీన్స్‌కు చెందిన రేముండో పూజంతే కయబ్యాబ్‌ను ఈ అవార్డు వరించింది. ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసె జ్ఞాపకార్థం 1957లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. దీన్ని ఆసియా నోబెల్‌గా అభివర్ణిస్తారు. ప్రతి సంవత్సరం రామన్ మెగసెసె ఫౌండేషన్.. ప్రభుత్వ సేవలు, ప్రజా సేవ, సామాజిక నాయకత్వం, జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మకత, ప్రపంచ శాంతి, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు లాంటి అంశాల్లో కృషి చేస్తున్నవారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎలాంటి ఆసరాలేని వారి గొంతుకను వినిపించేందుకు రవీష్ కుమార్ ఎన్ డి టి వి లో ప్రయిమ్ టైమ్ షో నిర్వహిస్తున్నారు. నైతికత తో నిబద్ధతతో అత్యున్నత ప్రమాణాలతో జర్నలిజాన్ని కొనసాగించడం, స్వాతంత్ర్యం, నిజం, సమగ్రత కోసం నైతిక ధైర్యంతో పోరాడడం, స్వరం లేని నిస్సహాయుల గళంగా మారడం, ప్రజాస్వామ్య లక్ష్యాల్ని చేరుకోవడం కోసం పాటుపడటం లాంటి లక్షణాలకు గుర్తింపుగా ఈ అవార్డును రవీష్‌ కుమార్‌కు ప్రదానం చేస్తున్నట్లు ఫౌండేషన్‌ పేర్కొంది. 

Related posts

సొంత ఇంట్లోనే తల్లీకూతుళ్ల దారుణ హత్య

Satyam NEWS

నల్లమల ఆటవీప్రాంతంలో పులి చర్మాల స్మగ్లర్ల పట్టివేత

Satyam NEWS

భట్టితో మాణిక్రావ్ భేటీ

Bhavani

Leave a Comment