గత నెల ప్రగతి భవన్ లో హస్కి అనే కుక్క చనిపోయిందని సంబంధిత డాక్టర్ పై 5 సంవత్సరాల శిక్ష పడేలా కేసు నమోదు చేసారు. కుక్క కు ఉన్న విలువ మనిషికి లేదా…మంత్రుల బాధ్యతారాహిత్యం వ్యవహారం వల్ల ఆర్టీ సీ కార్మికులు చనిపోతుంటే మంత్రుల మీద కేసు ఎంధుకు నమోదు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ మెడలు వంచి ఆర్టీసీ సమస్య పరిష్కారం అయ్యేలా కాంగ్రెస్ పార్టీ వత్తిడి తెస్తుందని ఆయన అన్నారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 19 లోపు సమస్య పరిష్కరించకుంటే 21న ప్రగతి భవన్ ముట్టడిస్తాం మని ఆయన హెచ్చరించారు. బేషజాలకు పోకుండా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఆయన కోరారు. కార్మికుల ను తొలగిస్తున్నాం…కొత్త వారిని నియమిస్తాం అని సీఎం అహాంకార పూరితంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్య లకు పాల్పడ్డారని ఆయన అన్నారు. గతంలో టీంఎంయూ కు గౌరవ అధ్యక్షుడుగా హరీష్ రావు ఉన్నడు..హరీష్ రావు ఎందుకు స్పందిస్తలేడు..అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
previous post
next post