28.2 C
Hyderabad
April 30, 2025 06: 52 AM
Slider ఆదిలాబాద్

రేవంత్ రెడ్డిని అడ్డుకోవడం మంచిపని కాదు

#Nirmal Congress

నిర్మల్ జిల్లాలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకునేందుకు ఈ రోజు నిర్మల్ కు రానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ని అడ్డుకోవడం ప్రభుత్వానికి తగదని మాజీ డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి అన్నారు.

రైతులతో రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరిపై  లాక్ డౌన్ చట్టాలకు లోబడి కేసులు పెడతామని నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆయన అన్నారు. కేవలం చట్టాలను  గౌరవించి మాత్రమే రేవంత్ రెడ్డి  కార్యక్రమాన్ని  వాయిదా వేస్తున్నామని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ తర్వాత ఖచ్చితంగా జిల్లాలోని  రైతులతో రేవంత్ రెడ్డి పర్యటించి వారికి జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను తెలుసుకుంటారని మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు దీని కోసం అవసరమైతే కాంగ్రెస్ కేంద్ర నాయకులను సైతం నిర్మల్ కు పిలిపిస్తామని ఆయన అన్నారు.

Related posts

ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్ ప్రారంభం

Satyam NEWS

పట్టించుకునే నాథుడు లేక అనాథలా మారిన గురుకుల పాఠశాల

Satyam NEWS

ప్రశాంత్ కిషోర్ మాటల్ని ప్రచారం చేసుకుంటున్న బిజెపి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!