31.7 C
Hyderabad
April 19, 2024 02: 53 AM
Slider రంగారెడ్డి

రైల్వే ప్రాజెక్టులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదు

#RaventhReddy

తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని రైల్వే జీఎం పేర్కొన్నారని మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు.

తన నియోజకవర్గంలో రైల్వే ప్రాజెక్టుల అమలు తీరుపై రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై గతేడాది రైల్వే శాఖకు లేఖ రాయడంతో పాటు, ఇటీవలే రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తో వీడియో కాన్ఫరెన్స్ లోనూ చర్చించానని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వెల్లడించారు.

తన లేఖకు బదులుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సుదీర్ఘ వివరణతో కూడిన లేఖ రాశారని తెలిపారు. రైల్వే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందడంలేదని రైల్వే జీఎం పేర్కొన్నారని రేవంత్ వివరించారు.

“రైల్వే జీఎం అంశాల వారీగా జవాబు ఇచ్చారు. టీఆర్ఎస్ సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, సహకారం అందించేందుకు ముందుకు రావడంలేదని తెలిపారు. సర్కారు పూర్తి నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయని జీఎం వివరించారు” అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

Related posts

అమ్ముడు పోయిన ఎమ్మెల్యే లు వెంటనే రాజీనామా చెయ్యాలి

Satyam NEWS

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

Satyam NEWS

తెలంగాణ లో పాఠశాలలకు మళ్లీ కరోనా దెబ్బ

Satyam NEWS

Leave a Comment