రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఈ స్థాయికి ప్రోత్సహించి ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ క్రీడా ప్రాంగణ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతతో ముందుకు సాగుతానని ఈ గౌరవం నాతో భాగస్వాములైన వారందరికీ దక్కిన గౌరవమని చైర్మన్ తెలిపారు. తన వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఒక పక్కన అవినీతిపై ఉక్కు పదం మోపుతూ మరో పక్కన క్రీడల అభివృధికి పాటుపడతానని, అదేవిధంగా ఎవరైతే క్రీడారంగంలో రాణించలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్లందర్నీ గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ముందుకు సాగేలా మంచి శిక్షకులను ఏర్పాటు చేసి ప్రతిభావంతులను వెలికి తీస్తామని శాప్ చైర్మన్ తెలిపారు. ప్రతి సోమవారం శాప్ కార్యాలయంలో విధిగా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కార్యకర్తల సమష్టి కృషి వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని అందరు సమానమేనని మంత్రి తెలిపారు.
రవి నాయుడు కష్టానికి దక్కిన గౌరవం ఇదని తెలుగుదేశం పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయని, దానిని రవినాయుడు రుజువు చేసాడని రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి అన్నారు. సియం చంద్రబాబునాయుడు, యువ నాయకులు మంత్రి లోకేష్ బాబు నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా మన నాయకులు ఇద్దరికీ మంచి పేరు తెచ్చే విధంగా పార్టీని అలాగే ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకునిపోయే విధంగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు.
యువనాయకులు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అండదండగా ఉంటూ సుమారు 200 రోజులు ఆ కార్యక్రమాన్ని ఎండా వాన కూడా లెక్క చేయకుండా రవి పనిచేశారని, కాబట్టి ఈ రోజు ఆయనకింత గౌరవం దక్కిందని అదే విధంగా తనకు రాయచోటి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చిన్న వయసులోనే మంత్రి పదవి ఇవ్వడం అనేది కేవలం సియం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఇచ్చిన గౌరవమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ ఎండీ గిరిష, మంత్రి కొల్లురవీంద్ర,తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మేల్యే పల్ల శ్రీనివాస్. ఆర్టీసి ఛైర్మన్ కొనకళ్ల నారాయణ , పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.