40.2 C
Hyderabad
April 19, 2024 18: 05 PM
Slider అనంతపురం

రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

#YSRCPRayachoti

రాయచోటిని  జిల్లా కేంద్రం గా  ప్రకటించాలని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ విజయ భాస్కర్ అన్నారు. రాయచోటి లో ఆయన తంబల్లపల్లె వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మాధవ రెడ్డితో కలసి విలేఖరులతో మాట్లాడుతూ  రాయచోటిని జిల్లా చేస్తే  రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని అన్ని ప్రాంతాలకు అనువైనదిగా,  కేంద్రంగా ఉంటుందన్నారు.

 రాయచోటి నియోజకవర్గములో వెలిగల్లు, రోళ్ల మడుగు ప్రాజెక్టులతో పాటు గండికోట ప్రాజెక్టు నుంచీ కూడా ఛీప్ విప్ శ్రీ కాంత్ రెడ్డి నీటి పథకాలతో  రాయచోటిని సస్యశ్యామలం చేస్తున్నారన్నారు. కర్నూలు, బెంగుళూరుహైవే సెంటర్లో ఉండడంతో వ్యాపార, వాణిజ్య పరంగా, రాకపోకలకు అన్నీ పట్టణాలకు ముఖ్య కేంద్రంగా ఉంటుందన్నారు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతమని చెప్పారు. గత రెండు ఎలెక్షన్స్ లోఎంపీ మిథున్ రెడ్డి కి కూడా రాయచోటి ప్రజలు ఎన్నికల్లో ఎక్కువగా మెజార్టీనీ ఇచ్చారని అన్నారు. రాజంపేట నియోజకవర్గములోని సుండుపల్లి, వీరబల్లి మండలాల ప్రజలు99 శాతం మంది రాయచోటి కోరుకుంటున్నారని తెలిపారు. 

రాయచోటిని జిల్లా చేస్తే ఎటు చూసినా రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అన్నీ నియోజకవర్గ లకు 75,కి,మీ పరిధిలోపల ఉందని తెలిపారు. ఇంకో10లక్షల జనాభా విస్తీర్ణ జరిగినా కూడా ఎలాంటి ఇబ్బందులకు తావు లేదన్నారు. రాయచోటిలో నీరు, డికెటి భూములు కూడా పుష్కలంగా ఉన్నాయని ఆయన అన్నారు.

నియోజకవర్గము పార్లమెంట్ పరిధిలో దాదాపు18 మండలాలకు చాలా దగ్గరగా ఉండి ఉన్నతమైన ప్రాంతమని చెప్పారు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు రాయచోటిని జిల్లా చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తంబల్లపల్లె మండల కన్వీనర్  మాధవ రెడ్డి  మాట్లాడుతూ  జిల్లా కేంద్రంగా మదనపల్లె ను ప్రకటించని పక్షంలో రాయచోటి ని జిల్లా కేంద్రం చేస్తే బాగుంటుందన్నారు.

Related posts

అందంగా తీగల వంతెన

Murali Krishna

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

విజయవాడలో బాలికపై సామూహిక అత్యాచారం

Satyam NEWS

Leave a Comment