27.7 C
Hyderabad
April 25, 2024 10: 28 AM
Slider వరంగల్

రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శం…

#MuttireddyYadagiriReddy

రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికి  ఆదర్శవంతమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. గురువారం తరిగొప్పుల మండలంలోని అంకుశపూర్, తరిగొప్పుల మరియు అబ్దుల్ నాగారం గ్రామలలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రాంభించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి వాటి ని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. సుమారు 300 మంది రైతులు సమావేశం జరుపుకునే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు.

కేసీఆర్‌ లక్ష్యానికి అనుగునంగా అధికారులు, ప్రజాప్రతినిధు లు పనిచేయాలన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు నీటి వసతి, 24 గంటల విద్యుత్‌, రైతు బందు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చూసుకుంటోందన్నారు.

రైతులు కేసీఆర్‌కు అండగా నిలువాలన్నారు. గత పాలకులు రైతుల క్షేమాన్ని విస్మరించారన్నారు. అవినీతి లేకుండా పారదర్శకమైన పాలనను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తుందన్నారు.అంకుశపూర్, పోతారం, సోలిపూర్, బొంతగట్టు నాగారం,బొత్తల పర్రె గ్రామాలకు నీటి సౌకర్యం లేనందున రిజర్వాయర్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

అంతేకాకుండా కాళేశ్వ రం నీటితో తెలంగాణలో కోటి ఎకరాల భూమి సస్యశ్యామలమైందన్నారు. సాగు నీటి సౌకర్యంలో భూమికి బరువైనట్లు వరి పంట పండిందన్నారు.

తదనంతరం అబ్దుల్ నాగారం గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, పల్లె ప్రకృతి వనంను ప్రారంభించి సర్పంచ్ అర్జుల రమా సంపత్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జు సంపత్ రెడ్డి, ఎంపీపీ జొన్నగొని హరిత సుదర్శన్ గౌడ్, వైస్ ఎంపీపీ చెన్నూరి ప్రమీల సంజీవులు, జడ్పిటిసి ముద్దసాని పద్మజా వెంకట్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణ రెడ్డి,

మండల అధ్యక్షుడు జుమ్లాల్, సర్పంచ్ లు దామెరా ప్రబుదాస్,వీరేందర్,జార్జిరెడ్డి,బుచ్చిరాజు,నంద్యా నాయక్, తిరుపతి,రవి,ఎంపీటీసీ లు మంగ, మధుసూదన్ రెడ్డి, కిష్టమూర్తి,తెరాస మండల అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఎంపిడివో ఇంద్ర కరణ్ రెడ్డి, విద్యుత్ ఏఈ అశోక్,

మండల ప్రత్యేక అధికారి శ్రీపతి,సీఐ సంతోష్, ఎస్సై హరిత,కార్యదర్శి లింగం, యువజన మండల అధ్యక్షుడు సుధీర్, మూల మహేష్, సుధాకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

జన సూరజ్: ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడు

Satyam NEWS

డ్రోన్ కెమారాతో పోలింగ్ ను పరిశీలించిన ఎస్పీ..!

Satyam NEWS

సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment