22.2 C
Hyderabad
December 7, 2022 22: 53 PM
Slider సినిమా

RDX లవ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వెంకటేష్

RDX-LOVE-2

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. ఈ సినిమా ఫస్ట్ ‌లుక్‌ని విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, సినిమా చాలా పెద్ద హిట్ కావాలంటూ విక్టర్ వెంకటేశ్ ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేశ్‌తో పాటు `పవర్` డైరెక్టర్ కె.ఎస్.రవీంద్ర(బాబీ), చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ లుక్ విడుదల చేసి యూనిట్‌కి అభినందనలు తెలిపిన వెంకటేశ్‌కి హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, నిర్మాత సి.కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. శంకర్ భాను రచనా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రధన్ సంగీతం, సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

సాంకేతిక వర్గం

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను, నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా
మ్యూజిక్: రధన్, సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి, డైలాగ్స్: పరుశురాం
ఫైట్స్: నందు, కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి, పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

Related posts

సినిమా రివ్యూ: ఆకట్టుకున్న యండమూరి వీరేంద్రనాధ్ అతడు ఆమె ప్రియుడు

Satyam NEWS

గ్రామ స‌చివాల‌య కార్య‌ద‌ర్శిల‌కు విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే వార్నింగ్….!

Satyam NEWS

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!