28.7 C
Hyderabad
April 20, 2024 07: 47 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం ప్రారంభం

ayesha mera 14

అయేషా మీరా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు సీబీఐ అధికారులు గుంటూరు జిల్లా తెనాలి చేరుకున్నారు. స్థానిక అధికారులను సంప్రదించి చెంచుపేటలోని శ్మశానవాటిక వద్దకు చేరుకున్నారు. అయేషా తల్లిదండ్రులతో పాటు మతపెద్దల అనుమతి కూడా ఇప్పటికే తీసుకున్నారు.

పోస్టుమార్టాన్ని వీడియోలు చిత్రీకరించి కోర్టుకు సమర్పించనున్నారు. దీంతో తెనాలిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెనాలిలోని చెంచుపేట స్మశాన వాటికలో రీపోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. 2007 డిసెంబర్ 27వ తేదీన ఇబ్రహీంపట్నంలోని ప్రైవేటు హాస్టల్‌లో అయేషా మీరా హత్య జరిగిన విషయం తెలిసిందే.

హత్య జరిగిన 12 సంవత్సరాల తర్వాత రీ పోస్టుమార్టం కేసు సిబిఐకి అప్పగించినందున ఆధారాల కోసం రీ పోస్టు మార్టం చేస్తున్న విషయం సత్యం న్యూస్ పాఠకులకు తెలుసు.

ఆయేషా మీరా రీ పోస్టుమార్టం సిబిఐ ఎస్పీ విమల ఆదిత్య ( విశాఖపట్నం), cbi ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ( హైదరాబాద్), హైదరాబాదు నుంచి వచ్చిన ఎనిమిది మంది డాక్టర్ల బృందం, తెనాలి ఎమ్మార్వో రవి బాబు సమక్షంలో చేస్తున్నారు.

Related posts

నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజుపై సీబీఐ దాడులు

Satyam NEWS

ఓయూ పీఎస్ లో తాడూరి శ్రీనివాస్ పై ఫిర్యాదు

Satyam NEWS

మా మొర ఆల‌కించండి…పోలీసు బాబులూ…..!

Satyam NEWS

Leave a Comment