28.7 C
Hyderabad
May 15, 2024 00: 48 AM
Slider ప్రత్యేకం

రీడ్‌ ఇండియా సెలబ్రేషన్‌ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్స్‌

#readIndia

రీడ్‌  ఇండియా సెలబ్రేషన్‌ 2022 (ఇంటర్నేషనల్‌) ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్స్‌కు ఆహ్వానం పలుకుతున్నది. 100 రోజులు, 100 కోట్ల మంది  పాఠకులు కోసం ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్స్‌ ఉంటాయి. విద్యార్ధులు గానీ సాధారణ ప్రజలు గానీ మే 8 నుంచి www.readindia.info ద్వారా నమోదు చేసుకుని పాల్గొనవచ్చు. ‘రీడ్‌, థింక్‌, యాక్ట్‌’(చదవండి, ఆలోచించండి, ఆచరించండి) అంశాన్ని 2022 కోసం ఎంపిక చేశారు.

హైదరాబాద్‌ ఐఐటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ప్రదీప్‌ రమణ్‌చర్ల నేతృత్వంలో 100 కోట్ల మంది ప్రజలను కలుసుకునేందుకు ఈ రీడింగ్‌ మూవ్‌మెంట్‌ ప్రారంభించారు. హిందీ, తెలుగు, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్‌ భాషలలో దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రపంచంలో విజయవంతమైన వ్యక్తులందరూ నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

భారతదేశపు అతిపెద్ద  నాలెడ్జ్‌ పండుగ అయిన దీనిలో చేరేందుకు, మరింత సమాచారం కోసం +91 8688 120 864 లేదా 9441 456 061 కాల్ చేయవచ్చు లేదా readindiacelebration2022@gmail.comకు ఈమెయిల్‌ చేయవచ్చు లేదా www.readindia.info సందర్శించవచ్చు.

రీడ్‌  ఇండియా సెలబ్రేషన్‌ అనేది ఓ అనుభవం. కేవలం విజ్ఞానాధారిత, స్వతంత్య్ర ఆలోచనలు కలిగిన  సంస్కృతులు మాత్రమే విజ్ఞాన ఆధారిత ఆర్ధికవ్యవస్థలుగా మారుతుంటాయి.  ఇవి మాత్రమే సంపద, సామరస్యానికి మార్గం సుగమం చేస్తుంది.

ఈ కార్యక్రమాన్ని రీడర్‌షిప్‌ అనే బీజాలు నాటడం లక్ష్యంగా చేసుకుంది (అంటే విద్యేతర పుస్తకాలు చదవడం, స్వీయ పరిస్ధితులు అభ్యసించడం). ప్రాక్టికల్‌ రీడింగ్‌ అనేది విజయానికి అత్యంత కీలకం. నో రీడింగ్‌. నో సక్సెస్‌  (చదువు లేకపోతే. విజయమూ లేదు) అనేది ఆర్‌ఐసీ అత్యంత కీలకమైన సందేశం.

రీడ్‌ ప్రధానంగా మూడు ఆర్‌లపై దృష్టి సారిస్తుంది

విద్యేతర పుస్తకాలను చదవడం

స్వీయ అభ్యాసం

పరిస్థితులను అధ్యయనం చేయడం

థింక్‌ (ఆలోచన) ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తుంది. అభివృద్ధిని ఇది లక్ష్యంగా చేసుకుంది

ఆచరణ (యాక్ట్‌)ఈ మూడు అంశాలనూ ప్రతిరోజూ నిబద్ధతతో చేయమని చెబుతుంది

ఈ కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్ధులు ఎలాంటి అంశం/నేపథ్యం అయినా సరే   వెబ్‌సైట్‌లో  నిర్థేశించిన లేదా తమ సొంత ప్రాధాన్యతకనుగుణంగా ఎంచుకోవచ్చు. పైన పేర్కొనబడిన నేపథ్యం తప్పనిసరి ఏమీ కాదు.

పాల్గొనే అభ్యర్ధులు ఒక డాక్యుమెంట్‌, ఒక వీడియో ను విద్యార్థులు, సిటిజన్‌ డ్యాష్‌బోర్డ్‌ పై అప్‌లోడ్‌ ఫైల్‌ సెక్షన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఫైల్స్‌ తప్పని సరిగా అప్‌లోడ్‌ చేయాలి.

ఆర్‌ఐసీ 2022 కోసం టైమ్‌ లైన్స్‌

1. స్టూడెంట్‌ రిజిస్ట్రేషన్స్‌ – మే 8 న ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15,2022 న ముగుస్తాయి.

2. స్టూడెంట్‌ దరఖాస్తులు పంపడం – మే 25 నుంచి ఆగస్టు 15,2022 వరకూ

3. మొదటి దశ పరిశీలన – సెప్టెంబర్‌ మరియు అక్టోబర్‌ 2022

4. రెండవ దశ  కోసం లీడర్‌షిప్‌ కోచింగ్‌ సెషన్‌ – క్వాలిఫయర్లు కోసం – నవంబర్‌ 2022

5. రౌండ్‌ 2 స్ర్కీనింగ్‌ – నవంబర్‌ 2022

6. గ్రాండ్‌ ఫైనల్‌ –డిసెంబర్‌ 2022 రెండు లేదా మూడవ వారం

ప్రతి విభాగంలోనూ విజేతలకు అందించే అవార్డులు

1. విభాగం1 – మూడు నుంచి ఐదు తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్‌ ; 2 వ బహుమతి – టాబ్లెట్‌+ ప్రైజ్‌మనీ

2. విభాగం 2 – ఆరు నుంచి 9 తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్‌ ; 2 వ బహుమతి – టాబ్లెట్‌+ ప్రైజ్‌మనీ

3. విభాగం3 – 10 నుంచి 12 తరగతులు – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్‌ ; 2 వ బహుమతి – టాబ్లెట్‌+ ప్రైజ్‌మనీ

4. విభాగం4 – అండర్‌ గ్రాడ్యుయేట్‌ మరియు గ్రాడ్యుయేట్‌ – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్‌ ; 2 వ బహుమతి – టాబ్లెట్‌+ ప్రైజ్‌మనీ

5. విభాగం5 – సిటిజన్స్‌ (వర్కింగ్‌ మరియు రిటైర్డ్‌) – మొదటి బహుమతి– ల్యాప్‌టాప్‌ ; 2 వ బహుమతి – టాబ్లెట్‌+ ప్రైజ్‌మనీ

Reading is fun, fashion, and fruition for the mind. Come, join India’s biggest knowledge festival, and register. For further queries, please call on Cell# +91 8688 120 864/ 9441456061 or email us at readindiacelebration2022@gmail.com,

For more details, please call: KALYAN CHAKRAVARTHY @ 9381340098

Related posts

అందుబాటులోకి రానున్న కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు

Murali Krishna

శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

కేంద్రం తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment