31.7 C
Hyderabad
April 19, 2024 00: 53 AM
Slider జాతీయం

యూపీలో సీఎం యోగి కీలక ప్రకటన

యూపీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరో కీలక ప్రకటన చేశారు యూపీ సీఎం యోగి. దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు దేశ రాజకీయాల్లో ఎంతో కీలకం. ఈ ఎన్నికలను తన పాలనకు రెఫరెండమ్‌గా తీసుకున్నారు యోగి. అటు ప్రధాని కూడా యూపీ ప్లస్ యోగి ఉపయోగి అని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు యూపీ సీఎం యోగి.

రానున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారాన. అయితే ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు యోగి. దీంట్లో విశేషం ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. పార్టీ చెప్పిన చోట తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి పాత్ర మారుతుంటుందని చెప్పారు.

ప్రతిసారి ఒకరు ప్రభుత్వంలోనే ఉండాలని లేదు, పార్టీకి కూడా పనిచేయాల్సి ఉంటుందని కామెంట్స్‌ చేశారాయన. అయితే, యోగి ప్రకటనపై జోరుగా చర్చ జరుగుతోంది. యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో అయోధ్య లేదా మధురా నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం గోరఖ్‌పుర్‌ నుంచి కూడా బరిలోకి దిగే అవకాశముందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ యూపీ శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. అటు ఉత్తర్​ప్రదేశ్​ మీరట్‌​లో మేజర్ ధ్యాన్​చంద్​ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా జిమ్‌లో కసరత్తు చేశారు ప్రధాని. మోదీ జిమ్‌ చేసి అక్కడున్నవారిని ఉత్సాహపరిచారు.

Related posts

రాయలసీమ లిఫ్ట్ పనులను వెంటనే నిలిపివేయాలి

Satyam NEWS

ఎస్.బి.ఐ. ఎదుట తెలంగాణ రైతు సంఘం ధర్నా

Satyam NEWS

ఖమ్మం నగరంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ

Satyam NEWS

Leave a Comment