40.2 C
Hyderabad
April 19, 2024 15: 46 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

కమ్మ కమ్మగా రియల్ ఎస్టేట్ కంపెనీ

Amaravathi

ఏదైనా రాష్ట్రానికి లేదా దేశానికి రాజధాని ఎందుకు? రాజధాని అంటే పరిపాలన కేంద్రం. పరిపాలనా కేంద్రం ఏర్పాటు చేసుకుంటే పాలన సులభంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజధాని ఏర్పాటు చేసుకుంటారు. అంతే కదా? అలా కాదు రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అని తెలుగుదేశం అభిప్రాయం. తను అధికారంలో ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం ఇదే రీతిలో రాజధానిని అభివృద్ధి పరచేందుకు ప్రణాళిక రూపొందించింది. మరి మేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా మీ భూములు ఇవ్వండి అంటే ప్రజలు ఇవ్వరు కదా? అందుకోసం కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఎక్కడున్నదో చూసి అక్కడ టెంటు వేశారు.

అదే అమరావతి (అంతకు ముందు ఈ పేరు లేదు. ఇది తెలుగుదేశం ఆవిష్కరణ) తమ కులం వారి నుంచి ల్యాండ్ తీసుకోవడానికి అన్ని రకాల పథకాలు సిద్ధం చేసుకున్నారు. భూములు కౌలుకు ఇచ్చిన వారిని ముందుగా పట్టుకుని వారికి నచ్చచెప్పి కౌలు రైతుల్ని దిక్కులేని వారుగా చేసేసి మూడు నాలుగు పంటలు పండే జరీబు భూముల్ని ప్రభుత్వం సేకరించడం మొదలు పెట్టింది. ఇలా 34 వేల ఎకరాలు సేకరించారు ఆ నాటి ముఖ్యమంత్రి సిబి నాయుడి ఆధ్యరంలో నారాయణ అండ్ కంపెనీ. ఈ మొత్తం ల్యాండ్ లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామని, మరో సింగపూర్ చేస్తామని, ప్యారిస్ చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేశారు.

దీనికి 51 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని లెక్క తేల్చారు. ప్రయివేటు సంస్థలకు అప్పగించేశారు. ఈ ప్రతిపాదన కేంద్రానికి పంపితే అక్కడి వారు ఫక్కున నవ్వారు. 51 వేల కోట్ల తో ఏం కడతావు? అసలు రాజధాని అంటే ఏమిటి? రాజధాని ఎందుకు? రాజధానిలో ఏం ఉండాలి? ఇవేం పిచ్చి ప్రశ్నలండీ మేం సింగపూర్ కడతాం అని బుకాయించి అందరి నోరూ మూయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. అధికారంలో పర్మింనెంటుగా ఉంటామని సిబి నాయుడు వేసుకున్న లెక్కలు తప్పాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క సారిగా వారికి కళ్లు తిరిగాయి. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల కోట్లు కొట్టేద్దామనుకున్న వారి కలలు కరిగిపోయాయి. దాంతో దుష్రచారం మొదలు పెట్టేశారు. కొత్త ప్రభుత్వాన్ని చులకన చేసి మాట్లాడేందుకు ప్లాన్ చేసుకున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, పుకార్లు ప్రచారం చేయడం, ఆ పుకార్లు ప్రజలు నిజమని నమ్మిన తర్వాత వాటిని సిబి నాయుడు చెప్పడం, సిబినాయుడు చెప్పిన దాన్ని ఎల్లో మీడియాలో అధికారికంగా ప్రచారం చేయడం. స్థూలంగా ఇదీ తెలుగుదేశం ప్రణాళిక.

ఈ ప్రణాళిక లో భాగంగా ఇప్పటికే చాలా వాటిని అమలు చేయగా కొన్ని చోట్ల బెడిసి కొట్టింది. డ్రామా ఆర్టిస్టులు దొరికి పోయారు. వారిపై పోలీసు కేసులు నడుస్తున్నాయి. ఇంకా దొరకని వాళ్లు చాలా మంది ఉన్నారు. రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా చేసినట్లు, తద్వారా 40 వేల కోట్ల రూపాయలు సంపాదించి రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని సిబినాయుడు ప్లాన్ వేసినట్లు తెలిసో తెలియకో ఒక ప్రముఖుడు తాను నడిపే ఒక యూట్యూబ్ ఛానెల్ లో చెప్పేశాడు. ఈ ప్రముఖుడు సిబి నాయుడి హయాంలో సమాచార శాఖలో ఒక ప్రముఖ స్థానంలో పని చేశాడు.

ఆ తర్వాత జగన్ ప్రభుత్వం రాగానే ఇతగాడిని మెడపట్టి బయటకు గెంటి ఆ రూంకు తాళం వేసింది. అది వేరే విషయం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే ఈ పెద్దమనిషి సిబి నాయుడి తెలివితేటల్ని పొగడాలనే ఉద్దేశ్యంతో వదిలిన ఈ వీడియో ఎంత బుద్ధి తక్కువదో అర్ధం చేయడానికే. అమరావతి భూములకు డిమాండ్ పెంచి అమ్ముతారట. తద్వారా 40 వేల కోట్లు వస్తాయట. అప్పటి వరకూ ప్రపంచ బ్యాంకు అప్పు తీసుకుని కాలక్షేపంచేస్తారట.

ఈ 40 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినపుడు ఆ అప్పుతీరుస్తారట. ఏం? ఇదంతా నీ బాబు సొత్తా? రాజధాని అనేది పరిపాలనా సౌలభ్యం కోసం ఉండాలి తప్ప నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమా? 39 వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఇప్పటికే ప్రారంభించి చాలా వరకూ పూర్తి అయ్యే దశలో ఉన్నాయట. మరి దీనికి  తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అని ఎందుకు అంటున్నావ్? ఇప్పుడు కట్టినవి శాశ్వతమైనవి కాదా? మళ్లీ ఇంకొకటి కడతావా? ప్రపంచ బ్యాంకు కు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఫిర్యాదులు చేసి ప్లాన్ మొత్తం చెడగొట్టారు అంటూ సదరు జానా బెత్తెడు జర్నలిస్టు వాపోతున్నాడు.

రాజధాని అన్ని అవసరాలు పోను 6 వేల ఎకరాలు మిగులుతుందట. దీన్ని ప్రయివేటు సంస్థ ఒకటి అమ్మిపెడుతుందట. ప్రయివేటు ల్యాండ్ ను మనం డెవలప్ మెంట్ కు ఇస్తాం కదా ఇది కూడా అలాంటిదే నని ఈ జర్నలిస్టు ప్రముఖుడు తెరపైకి వచ్చి చెబుతున్నాడు. నీ బాబు సొమ్మని ఈ ల్యాండ్ పై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? ఈ 6 వేల ఎకరాలలో నాలుగు వేల ఎకరాలు అమ్ముతాడట, మరో 2 వేల ఎకరాలు ఉంచి బంగారు బాతుగా మారిన తర్వాత అమ్ముతాడట. ఎంత కమ్మగా ఉన్నాయి ఈ లెక్కలు.

ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత చెబితే ఆహా సిబి నాయుడు ఎంత తెలివిగలవాడు అని ప్రజలు ఆశ్చర్యపోతారు అని లెక్కేసుకుని చెప్పాడు తప్ప ఈ లెక్కలు వింటే ప్రజలు నవ్వుతారనే ఇంగితం కూడా లేదు అతగాడికి. వివిధ కంపెనీలకు, హోటళ్లకు, ప్రయివేటు విద్యా సంస్థలకు ఇచ్చిన ల్యాండ్ పరిస్తితి ఏమిటని ఇతగాడు అమాయకంగా ప్రశ్నిస్తున్నాడు. పాపం వారికి ల్యాండ్ హ్యాండోవర్ చేయకపోతే తీసుకున్న కిక్ బ్యాక్స్ తిరిగి ఇచ్చేయాలేమో. ఇవన్నీ పెట్టుకునే తెలుగుదేశం, దాని అనుబంధ మేధావులు ఇంతలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.

జగన్ ప్రభుత్వం మరింత స్పీడ్ గా వ్యవహరించి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చెక్ పెట్టాలి. రాష్ట్రం అభివృద్ధికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లింక్ పెట్టి మాట్లాడుతున్న తెలుగుదేశం దాని అనుబంధ మేధావుల మాయలో జగన్ పడకుండా ఉండాలి. అప్పుడే రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతుంది. ఏ ప్రభుత్వమైనా ఆదాయం తెచ్చుకోవాల్సింది పన్నుల నుంచే కాని రియల్ ఎస్టేట్ బ్రోకరేజి నుంచి కాదు.  

Related posts

నిర్భయ నిందితులకు 16న ఉరి శిక్ష అమలు

Satyam NEWS

ఆర్డీవో కేసులు వాయిదా వేయాలని వినతి పత్రం

Satyam NEWS

తప్పిన ముప్పు: కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి

Satyam NEWS

Leave a Comment