Slider మహబూబ్ నగర్

వనపర్తిలో రోడ్లను అమ్ముకుంటున్న రియల్టర్లు

#road

వనపర్తి జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వారు భూమిని ప్లాట్లుగా మార్చిన తర్వాత లే అవుట్ అనుమతి లేకుండా మొదటి సారి వెంచర్ లో మ్యాపులో(నక్ష) రోడ్డును చూపి ప్లాట్లు అమ్ముతారు. తర్వాత రెండో సారి రోడ్డును మాయం చేసి ప్లాట్లుగా చూపించి కొత్తగా నంబర్లు వేయడం లేదా బై నంబర్ వేసి ప్లాట్లు అమ్ముతారు. వనపర్తిలో ప్లాట్లకు డిమాండ్ ఉండటం వల్ల రోడ్డును మాయం చేసి ప్లాట్లు చేసి అమ్ముతారు. ఇటీవల మునిసిపల్ పరిధిలో రోడ్లను ప్లాట్లుగా చేసి అమ్మిన వారిపై జిల్లా కలెక్టర్ కు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజికి పిర్యాదు చేసారు. రిజిస్ట్రేషన్ ను రద్దు చేశారు. రోడ్లు మాయం అవుతున్నట్లు తెలిసినా అధికారులు పట్టించుకోరు. ఎవరి వాటా వారికీ చేరుతుంది.

ప్రస్తుతం కూడా బిటి రోడ్లు, పేరున్న కాలనీల్లో రోడ్లను మాయం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను తనిఖీ చేస్తే ప్లాట్లుగా మారుతున్న రోడ్లు వెలుగులోకి వస్తాయి. కాగా అవినీతి అక్రమాలు, డబ్బులు పంచుకునే సమయంలో అందరు ఏకమౌతారు. సమాజంలో ఓర్వలేని వారికీ, మోసగాళ్ళకు, అసూయపరులకు కష్టం చేయకుండా డబ్బులు లాగటం అలవాటు.వారికీ ఎదుటి వారిపై, రక్త సంబంధంపై అనగా అన్న దమ్ములు, అక్క చెల్లెళ్ళు అనే ప్రేమ ఉండదు. ఎదుటి వారిని అకర్శించి మోసం చేయడం, నీతులు చెప్పడం మోసగాళ్ళకు అలవాటు. చెడు గుణం ఉన్న వారికి పుల్లలు పెట్టడం, మనిషి లేనప్పుడు ఎదుటి వారిపై చాడీలు చెప్పడం, నోరు తెరిస్తే అబద్దాలు చెబుతారు. వనపర్తిలో అన్ని వెంచర్లు, కాలనీల్లో రోడ్లను తనిఖీ చేయాలనీ నిజాయితీ పరులు కోరుతున్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మానేరు రివర్ ఫ్రంట్ పై వేగంగా ప్రభుత్వ చర్యలు

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇస్తేనే బిహార్‌లో అభివృద్ధి

mamatha

ఒకవైపు కర్తవ్యం.. మరోవైపు మానవత్వం చాటుకున్న ములుగు ఎస్సై హరికృష్ణ

Satyam NEWS

Leave a Comment