39.2 C
Hyderabad
March 29, 2024 15: 47 PM
Slider ఆంధ్రప్రదేశ్

అవార్డ్: రియల్ టైమ్ పర్యవేక్షణతో పర్యావరణ రక్షణ

polution

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ (ఆర్ టిపిఎమ్ఎస్) ప్రాజెక్ట్ కు ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పలు సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నది. ఈ సంస్కరణల్లో ఒకటి రియల్ టైమ్ కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థ (RTPMS). ఈ వ్యవస్థను అమలు చేయడం ద్వారా కాలుష్య యూనిట్లను పర్యవేక్షిస్తోంది.

ఏదైనా పరిశ్రమ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్ SMS అలర్ట్ వస్తుంది. దీనిపై తక్షణ చర్యలను తీసుకునేందుకు స్థానిక అధికారులు వెళతారు. ప్రమాణాలు పాటించని పరిశ్రమలకు నోటీసులు జారీ చేస్తారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ అవార్డు ప్రకటించడంతో నేడు ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో APPCB సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మార్గదర్శనంతో ఈ ప్రాజెక్టును అమలు చేశామని అన్నారు. ఈ వ్యవస్థతో పర్యావరణ పరిరక్షణ పూర్తి స్థాయిలో జరిగిందని ఆయన అన్నారు.

Related posts

వ్యాయామ ఉపాధ్యాయులు మధ్యాహ్నమే స్కూలుకు వెళ్లాలి

Satyam NEWS

వి ఎస్ యూ పరీక్ష నియంత్రణ అధికారి గా డా. ఆర్.ప్రభాకర్

Satyam NEWS

మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేరు

Murali Krishna

Leave a Comment