వరుణ్ తేజ్, పూజా హెగ్డే, అధర్వ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ మరోసారి మెగా హీరోతో కలిసి తెరకెక్కించిన సినిమా ఈ వాల్మీకీ. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన జిగర్తాండ సినిమాకి రీమేక్ గా రూపొందినది వాల్మీకి చిత్రం. వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఏరియా వైజ్ ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవి: నైజాం-7.4కోట్లు, సీడెడ్-3.35కోట్లు, ఆంధ్రా-9 కోట్లు, ఏపీ తెలంగాణ ఓవరాల్ గా 19.75 కోట్లు, కర్నాటక రెస్టాఫ్ ఇండియా- 1.50 కోట్లు, అమెరికా- 2.2 కోట్లు, అమెరికాయేతర దేశాలు- 80లక్షలు.కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్న వరుణ్ తేజ్, వాల్మీకీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలంటే మొత్తం మీద పాతిక కోట్ల దాక రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వాల్మీకీ సినిమాకి ఉన్న క్రేజ్, హరీశ్ శంకర్ మార్కెట్, పూజ గ్లామర్, మెగా ఫ్యాన్స్ అండ… అన్నీ కలిపి చూస్తే వరుణ్ 25 కోట్ల మార్క్ టచ్ చేయడం పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. మరి మెగాహీరో ఆ మార్క్ టచ్ చేసి క్లీన్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
previous post
next post