నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల హుండీల లెక్కింపు మంగళవారం జరిగింది. ఈ లెక్కింపులో రూ 5,96,92,376/-నగదు రాబడి లభించింది. ఈ ఆదాయాన్ని భక్తులు గత 26 రోజులలో స్వామి అమ్మవార్లకు సమర్పించడం జరిగింది. నగదు తో పాటు 232.4 గ్రాములు బంగారు, 7 కేజీల 850 గ్రాముల వెండి మరియు విదేశీ కరెన్సీ లభించింది. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య ఈ లెక్కింపును శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు చేపట్టారు. అధికారులు, బ్యాంకు సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.
previous post