ఐదు సంవత్సరాల పదవి కాలం లో రూ.119 కోట్లతో వికారాబాద్ అభివృద్ధి పథకాలు చేపట్టినట్లు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మీడియా సమావేశంలో తెలిపారు. గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృషితో వికారాబాద్ మున్సిపాలిటీకి 80 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ వికారాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారం నాకు ఎంతో లభించింది. నా వార్డు ప్రజలకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా. ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవిలో నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. ఐదు సంవత్సరాల పదవి కాలంలో బాధ పడ్డ రోజులు కూడా ఉన్నాయి. నా రాజకీయ కార్యాచరణ కొనసాగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. కరోనా సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాం. ఐదు సంవత్సరాల పదవీకాలంలో రాజకీయ అనుభవం లేకున్నా ప్రజలతో మమేకమై అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేము అని ఆమె అన్నారు.
previous post