24.7 C
Hyderabad
March 29, 2024 06: 51 AM
Slider ముఖ్యంశాలు

గద్వాల మార్కెట్ లో రికార్డు సృష్టిస్తున్న వేరుశనగ

#GroundNutCrop

గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ ధర రికార్డు సృష్టిస్తూ గత మూడు రోజుల వరుసగా అత్యధికంగా వచ్చింది. గురువారం రోజు మొదటిసారి రూ 8వేల మార్కు దాటింది.

గతంలో ఎప్పుడూ లేనంతగా క్వింటా ధర పెరుగుతూ పోవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చల్లపాడు గ్రామానికి చెందిన రైతు అంబయ్య 9.90క్వింటాళ్ల వేరుశనగ సరుకు తీసుకొచ్చారు.

సరుకు బాగుండటంతో అత్యధికంగా రూ.8001 రికార్డు స్థాయిలో ధర వచ్చింది. గురువారం వ్యాపారస్తుల సంఘం కార్యవర్గ కమిటీ తరపున వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న , వ్యాపారస్తులు, అధికారులు రైతును శాలువతో సన్మానించారు.

రైతులు సన్మానించడం నా అదృష్టం

గద్వాల వ్యవసాయ మార్కెట్ లో వేరుశనగ పంటకు వరుసగా రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలకడం సంతోషకరమని వ్యవసాయ మార్కెట్ ఛైర్ పర్సన్ రామేశ్వరమ్మ కురుమన్న అన్నారు. 

ఆరుగాలం కష్టపడి పండించిన రైతును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అత్యధిక ధర వచ్చిన రైతులు సన్మానించడం వంటి వినూత్న కార్యక్రమం ప్రారంభించడం జరిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని,  ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని పండుగలా చేయాలనే ఆలోచనలతో రైతు బంధు, రైతు బీమాతో పాటు  వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారని తెలిపారు.

Related posts

కిమ్ పాలన గుర్తు చేస్తున్న వై ఎస్ జగన్

Satyam NEWS

ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్ అవార్డుకు వీఎస్యూ విద్యార్థి ఎంపిక‌

Sub Editor

చిన్నారుల టీకా ధరపై కీలక ప్రకటన.. 3 డోసులుగా వ్యాక్సిన్..

Sub Editor

Leave a Comment