రాష్ట్రవ్యాప్తంగా విశేష ప్రచారం ఉన్న బాలాపూర్ లడ్డు ఈ సారి అత్యధిక ధరకు వేలం వేశారు. ఈ లడ్డూ ధర 17లక్షల.60 వేల రూపాయలు పలికింది. కొలను రామిరెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డును ఈ ధరకు సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేషుడి లడ్డు దక్కించుకోవడం ఎంతో శుభ సూచకంగా భావిస్తారు. బాలాపూర్ లడ్డు వల్ల సకల సంపదలు కలుగుతాయని నమ్మకం. అందుకోసమే వినాయకచవితి సందర్భంగా పూజలు చేసి ఉంచే ఈ లడ్డును సొంతం చేసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నిస్తారు. ప్రతి ఏటా ఈ లడ్డును తాపేశ్వరం మిఠాయి తయారీదారులు తయారుచేస్తారు. గత ఏడాది ఈ లడ్డు ధర రూ.16.60 లక్షలు పలికింది. ఈ జారి జరిగిన వేలం లో దాదాపు 20 మంది పోటీ పడగా చివరకు కొలను రామిరెడ్డి దక్కించుకున్నారు.
previous post