29.2 C
Hyderabad
September 10, 2024 17: 14 PM
Slider సంపాదకీయం

టీడీపీ నో ఎంట్రీ: ఆ వైసీపీ నేతలకి చంద్రబాబు రెడ్‌ కార్డ్‌!

#chandrababu

ఏపీలో జోరుమీద ఉన్న ఎన్డీఏ సర్కారులోకి వెళ్లాలని ఎంతో మంది వైఎస్ఆర్ సీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, గతంలో మర్యాదగా నడుచుకున్న వారికే ఛాన్స్ ఉంటుందని ఆయా పార్టీల అధినేతలు గతంలోనే స్పష్టం చేశారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీ లేదా జనసేన పార్టీల్లో చేరిన నేతలు కూడా సక్రమంగా వ్యవహరించేవారే ఉన్నారు. వివాదాస్పద నేతలు ఎవర్నీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేర్చుకోలేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి నానాటికీ దిగజారుడుగా అవుతున్న వేళ ఎంతో మంది వైసీపీ నేతలు పార్టీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు.

అలాగని వెంటనే మరో పార్టీలోకి జంప్ అవుదామా అంటే అందరికీ ఎంట్రీ ఉండదు. కానీ, వైసీపీలో ఉండలేని నేతలు మాత్రం రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరుగా జగన్ కు ఝలక్ లు ఇస్తున్నారు. పార్టీని వీడుతున్నప్పటికీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో ప్రకటించడం లేదు. పార్టీని వీడి సైలెంట్ గా మాత్రం ఉంటున్నారు. కేశినేని నాని లాంటి ఒకరిద్దరు మాత్రం ఇక తాము రాజకీయాలకు దూరంగా ఉంటామని తేల్చి చెప్పేశారు. అయితే, ఇటీవలి కాలంలో రాజీనామాలు చేస్తున్న వారంతా వ్యూహాత్మకంగానే వైసీపీని వదిలిపెడుతున్నారని అంటున్నారు.

వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత రాజీనామా చేసిన నేత రావెల కిషోర్ బాబు. ఆ తర్వాత ప్రకాశం జిల్లాకు చెందిన శిద్ధా రాఘవరావు, గుంటూరు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, పెండెం దొరబాబు, మాజీ మంత్రి ఆళ్ల నాని ఇలా ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నవారిలో ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ కు సన్నిహితుడిగా ఉండేవారు ఆళ్ల నాని. ఆయన కూడా వైసీపీలో నుంచి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే, వీరంతా ముందు వైసీపీ నుంచి వీలైనంత త్వరగా బయట పడటమే మంచిదనే ఉద్దేశంతోనే రాజీనామాలు చేశారని అంటున్నారు.

అయితే, ఈ అందరికీ కూటమి పార్టీల్లో చేరాలని ఆశగా ఉందని చెబుతున్నారు. కానీ అందరి విషయంలో కూటమి పార్టీల నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందా? అనే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం చేరికలపై కూటమి పార్టీలు కూడా ఫోకస్ చేయడం లేదు. ముందు పాలనపై దృష్టి పెడుతున్నాయి. టీడీపీ, జనసేన ఎలాంటి ఆకర్షణలు చేయకపోయినా కూడా వైసీపీకి వరుస షాక్ లు తప్పడం లేదు. రోజురోజుకు కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం.. వైసీపీని వదిలేసి ఖాళీగా ఉంటే సమయం వచ్చినప్పుడు ఏదో ఒక పార్టీలో చేరవచ్చనే ఉద్దేశంతో వైసీపీని వీడటం మంచిదనే ఆలోచనతోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారని అంటున్నారు. అయితే, వైసీపీని వదిలేసిన ప్రతిఒక్కరిని చంద్రబాబు టీడీపీలోకి రానివ్వరనే విషయం గతంలోనే స్పష్టం చేశారు. కాబట్టి, అధికారంలో ఉండగా రెచ్చిపోయిన కొందరు వైసీపీ నేతలకు మాత్రం ఎప్పటికీ టీడీపీ లేదా జనసేనలోకి ఎంట్రీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

బిగ్ బ్రదర్ తో తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తున్న దర్శకసంచలనం గోసంగి

Satyam NEWS

అన్ని వర్గాల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం: మంత్రి  పువ్వాడ

Satyam NEWS

అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి విద్యార్థుల కావలెను

Satyam NEWS

Leave a Comment