39.2 C
Hyderabad
April 23, 2024 15: 41 PM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే

#redcrossday

లాక్ డౌన్ సమయంలో వలస కూలీలకు సాయంచేస్తూ కరోనాకు గురై కోలుకున్న యువకుడిని రెడ్ క్రాస్ సన్మానించింది. వరల్డ్ రెడ్ క్రాస్  డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణ లో రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు హ్యాండ్రు  డూనాట్ జన్మదిన వేడుకలను నిర్వహించారు.

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరోనా వారియర్ చరణ్ గౌడ్ ను గానంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ సెక్రటరీ బొల్లారం సుధీర్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, కోశాధికారి విజయ్ రెడ్డి, సలహాదారులు శశికళా సౌహాన్, ,బండారి దేవన్న,సామల ప్రశాంత్,పసుపుల రాజు దొంతుల ప్రవీణ్,పెంటపర్తి ఉషన్న, కో ఆర్డినేటర్ రూపేష్ రెడ్డి కుంట కిరణ్ రెడ్డి పొట్టిపెల్లి విజయ్, ఉరే గణేష్, కర్నె గణేష్, వోటేర్కర్ సంతోష్ కిసాన్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రస్థుత క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మహమ్మారి గురించి ప్రతి ఒక్కరినీ అవగాహన కల్పించడం, సకాలంలో రక్తం సమకూర్చడం, గత లోక్ డౌన్ లో రెడ్ క్రాస్ ద్వారా వలస కూలీలకు అహారం ఏర్పాటు చేయడం, గూడాలలో తండాలలో నిత్య అవసరం వస్తువులు అందించడం జరిగిందని  అని కరోనా వచ్చి కోలుకున్న వారు ఒక సామాజిక బాధ్యత తో ముందుకొచ్చి సకాలంలో ప్లాస్మా దానం చెయ్యాలని యువత, రెడ్ క్రాస్ వాలెంటర్స్, స్వచ్చంద సంస్థలకు కోరుతున్నామని  జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్, వైస్ ఛైర్మన్ బాల శంకర్ కృష్ణ లు కోరారు.

Related posts

క్రికెట్ బెట్టింగ్ లకు అడ్డా పెదవేగి గడ్డ

Satyam NEWS

పాత్రుని వలసలో ఘనంగా అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

Satyam NEWS

అభివృద్దిని చూడలేని కబోదులు….కాంగ్రెస్ వారు

Satyam NEWS

Leave a Comment