36.2 C
Hyderabad
April 25, 2024 21: 42 PM
Slider కడప

అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ల‌పై పీడీ యాక్ట్‌

red sandal-3

అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్లు షేక్ చింపతి లాల్ బాషా, షేక్ చింపతి జాకీర్ లపై పి.డి.చట్టం ప్రయోగించారు. ప్రఖ్యాతమైన, విశిష్టమైన ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్నతున్న‌టువంటి అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్లు వీరిద్ద‌రు.
1) షేక్ చింపతి లాల్ బాషా అలియాస్‌ రింగులు, తండ్రి : ఫక్రువల్లి అలియాస్‌ ఫక్రుద్దీన్, వయస్సు: 36 సంలు, వృత్తి : ఎర్రచందనం అక్రమ రవాణా, ఖాదరపల్లి గ్రామం, చాపాడు మండలం, కడప జిల్లా.
2) షేక్ చింపతి జాకీర్, తండ్రి : ఫక్రువల్లి ఫక్రుద్దీన్, వయస్సు: 27 సంలు, వృత్తి: ఎర్రచందనం అక్రమ రవాణా, ఖాదరపల్లి గ్రామం, చాపాడు మండలం, కడప జిల్లా.

వీరు గత రెండు సంవత్సరాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. 2018 వ సం. నుండి ఇప్పటివరకు కడప జిల్లాలో షేక్ చింపతి లాల్ బాషా పై 15 కేసులు, షేక్ చింపతి జాకీర్ పై 12 కేసులు నమోదయ్యాయి. షేక్ చింపతి జాకీర్ పై 2015 వ సం. లోనూ, షేక్ చింపతి లాల్ బాషా అలియాస్‌ రింగులుపై 2016 వ సం. లోనూ పి.డి.చట్టం ప్రయోగించారు. జైలు నుండి బయటకు వచ్చి తిరిగి వ‌చ్చి ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పరచుకుని ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. వీరు తమిళనాడు రాష్ట్రం జావాదిమలై అటవీ ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లతో సంబంధా లేర్పరచుకుని జావాదిమలై అటవీ ప్రాంతాలలోని గ్రామాలకు చెందిన కూలీలను ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపి కడప జిల్లాలోని శేషాచలం, లంకమల, నల్లమల అటవీ ప్రాంతాలలో పై కూలీలతో ఎర్రచందనం చెట్లను నరికించి వాటిని దుంగ లుగా చేయించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లకు విక్రయించి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు.

గతంలో ఇంటి దొంగతనాలు, చైన్ స్నాచింగ్ లకు పాల్పడేవారు. వీరిపై కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ లలో దొంగతనం కేసులు నమోదై వాటిలో జైలుకు కూడా వెళ్లి వ‌చ్చారు. పైన తెలిపిన ఇరువురు అంతర్ రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్లపై పి.డి చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు M.దేవ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ (OSD) పర్యవేక్షణలో కడప జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఐ.ఏ.ఎస్కి పి.డి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయమని ప్రతిపాదనలు సమర్పించారు. ఈ మేరకు వీరిపై పి.డి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేశారు. దానిని సంబంధిత ముద్దాయిలపై అమలు నిమిత్తం సెంట్రల్ జైలు అధికారులకు అందజేశారు.
ఎర్ర చందనం అక్రమ రవాణా, ఎర్ర చందనం రవాణాకు సహకరించిన వారి పై కఠీన చర్యలు ఉంటాయి అని ఎస్పీ చెప్పారు.
అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి పి.డి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు పొందేందుకు కృషి చేసిన సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్.పి కే.కే.ఎన్.అన్బురాజన్ ఐ.పి.ఎస్ అభినందించారు.

Related posts

తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో దళితుల ఎజెండా ఉండాలి

Satyam NEWS

వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

నూతన గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి

Bhavani

Leave a Comment