36.2 C
Hyderabad
April 18, 2024 11: 52 AM
Slider ఆధ్యాత్మికం

లాక్‌డౌన్‌లో శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల టికెట్లకు రీఫండ్‌

#TirupathiBalajee

లాక్‌డౌన్ కార‌ణంగా మార్చి 13 నుండి జూన్ 30వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్(tirupatibalaji.ap.gov.in) ద్వారాగానీ, పోస్టాఫీసు, ఇ-ద‌ర్శ‌న్, ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా గానీ శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, వ‌స‌తి గదులను బుక్ చేసుకున్న భ‌క్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ పొందేందుకు డిసెంబరు 31వ తేదీ వరకు టిటిడి మరో అవకాశం కల్పించింది.

ఈ మేర‌కు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భక్తులకు వాటిని ఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసు, ఈ-దర్శన్ కౌంటర్లు, ఎపి ఆన్ లైన్ కౌంట‌ర్ల ద్వారా బుక్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత టికెట్ వివ‌రాల‌తోపాటు, బ్యాంకు ఖాతా నంబ‌రు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ వివ‌రాల‌ను excel టెక్ట్స్ లో‌ టైపు చేసి refunddesk_1@tirumala.org మెయిల్ ఐడికి పంపాల‌ని టిటిడి కోరుతోంది.

మెయిల్ వివ‌రాల ఖ‌చ్చిత‌త్వాన్ని ప‌రిశీలించిన అనంత‌రం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భ‌క్తుల ఖాతాల్లోకి జ‌మ చేస్తారు. టికెట్లు రద్దు చేసుకుని రీఫండ్ పొందడానికి ఇష్టపడని భక్తులు డిసెంబరు 31వ తేదీలోపు వారికి అనువైన తేదీల్లో ఆ టికెట్లు చూపి శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. ఈ రెండు అవకాశాల్లో ఒకదాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరడమైనది.

2021 డైరీలు, క్యాలెండ‌ర్లు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అవ‌కాశం

టిటిడి ముద్రించిన 2021 డైరీలు, క్యాలెండ‌ర్లను భ‌క్తులు ఆన్‌లైన్‌(tirupatibalaji.ap.gov.in) ద్వారా బుక్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించ‌డ‌మైన‌ది. భ‌క్తులు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని కోర‌డమైన‌ది.

Related posts

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

238 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

Bhavani

బోద‌వ్యాధి రాకుండా డీఈసీ మాత్ర‌ల‌ను తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment