37.2 C
Hyderabad
March 29, 2024 17: 41 PM
Slider హైదరాబాద్

రిజిస్ట్రేషన్లపై ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత హ‌ర్ష‌ణీయం

Sama

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింద‌ని, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద‌ని, రిజిస్ట్రేషన్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవ‌డం హ‌ర్ష‌ణీయ‌మ‌ని కందుకూరు మండ‌ల టీఆర్ఎస్ ఉపాధ్య‌క్షులు సామ మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింద‌న్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగిపోయాయ‌న్నారు. రిజిస్ట్రేషన్‌ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెల‌ప‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. ఇక‌ అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్ల రిజిస్ట్రేషన్లు మాత్రం కుదరదని పేర్కొన్నారు. అనుమతులు ఉన్న, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లు యథాతథమని వెల్ల‌డించ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం, టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అనేక నిర్ణ‌యాల‌తో కొత్త ఒర‌వ‌డిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ఇందుకు తాము కూడా ఆయ‌న బాట‌లోనే న‌డుస్తూ సీఎం కేసీఆర్ ఆద‌ర్శాల‌కు అనుగుణంగా న‌డుస్తూ పార్టీ ప‌టిష్ట‌త‌కు క్ర‌షి చేస్తామ‌ని సామ మ‌హేంద‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Related posts

నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అమరవీరుల వర్ధంతి సభలు

Murali Krishna

సెలబ్రేషన్స్: పతంగుల పండుగలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Satyam NEWS

పోలీసు సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment