కాంట్రాక్టు పై పని చేస్తున్న ఆర్ట్స్, క్రాఫ్ట్, పిఈటి లను రెగ్యులరైజ్ చేయాలని కడప జిల్లా కాంట్రాక్ట్ ఆర్ట్స్, క్రాఫ్ట్, పిఈటి సంఘం అధ్యక్షుడు చంద్ర శేఖర్ కోరారు. విజయవాడలో ని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్.సూర్యనారాయణ కు వినతి పత్రం అందచేశారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ మస్తాన్, కమిటీ మెంబర్ ఇజ్రాయిల్ ప్రసాద్, కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్ లత, కోశాధికారి బోస్, విజయకుమారి, సురేష్, సూర్య లక్ష్మీ, రమ, పుల్లయ్య తదితరులు కూడా పాల్గొన్నారు. ఆర్ట్స్, క్రాఫ్ట్, పిఈటి లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు.