35.2 C
Hyderabad
April 24, 2024 12: 38 PM
Slider నల్గొండ

స్పెషల్ బడ్జెట్ విడుదల చేసి మోడల్ కాలనీ పూర్తిచేయాలి

#Hujurnagar Congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మాధవ రాయినిగూడెం 28వ మున్సిపాలిటీ వార్డు ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద ఏర్పాటు చేసిన మోడల్ కాలనీ కి నిధులిచ్చి పేదల్ని ఆదుకోవాలని టీపీసీసీ జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా డిమాండ్ చేశారు.

హుజూర్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మోడల్ కాలనీ ఏర్పాటు చేశారు. ఇప్పటికి దాదాపు 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీ అభివృద్ధిని పక్కన పెట్టింది.

పట్టణంలో చాలా మంది అర్హులైన నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవని, వారిని దృష్టిలో ఉంచుకొని గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఫణిగిరి రామస్వామి గట్టు వద్ద మోడల్ కాలనీ నిర్మాణం చేసిందని అజీజ్ పాషా అన్నారు.

సుమారు 3 వేల మంది లబ్ధిదారులకు ఇవ్వాలనే ఉద్దేశంతో  నాడు ఆ కార్యక్రమం చేపట్టారని, పట్టణంలో చాలా మంది పేదలు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి  ఎన్నికల్లో గెలిచిన పార్టీ అసంపూర్తిగా ఉన్న పనులకు బడ్జెట్ మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్ మాట్లాడుతూ డెబ్బై శాతం  పూర్తి అయిన  మోడల్ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడిందని, మోడల్ కాలనీ పూర్తి అయితే అర్హులైన వారందరికీ కాలనీలో ఇళ్ళు ఇవ్వటానికి అవకాశముంటుందని అన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే   స్పెషల్ బడ్జెట్ విడుదల చేసి మోడల్ కాలనీని డబుల్ బెడ్రూమ్ లుగా మార్చి  పనులను వెంటనే పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా మల్లికార్జున్  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ర్ కుమార్, జక్కుల మల్లయ్య,v.వీరారెడ్డి, మొదల సైదులు, నందిగామ శ్రీను,కస్తాల ముత్తయ్య, దొంతగాని జగన్, sk.అజ్ఞు, చప్పిడి సావిత్రి, మేళ్లచెర్వు ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రే.. బలమైన ఆధారాలు

Satyam NEWS

కొల్లాపూర్ లో ఆ బిల్డింగ్ లకు 50లక్షల దాకా పెనాల్టీ

Satyam NEWS

 తుమ్మల పయనమెటు

Murali Krishna

Leave a Comment